SSMB28: మహేష్ సినిమాలో జయరామ్.. నెట్టింట వైరల్ అవుతోన్న ఫోటో!

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో 28వ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో మహేష్ మరోసారి తనదైన స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. కాగా, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

SSMB28: మహేష్ సినిమాలో జయరామ్.. నెట్టింట వైరల్ అవుతోన్న ఫోటో!

Mahesh Babu With Actor Jayaram Pic From SSMB28 Sets Goes Viral

SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో 28వ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో మహేష్ మరోసారి తనదైన స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. కాగా, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

SSMB28: పండగకు ట్రీట్ పట్టుకొస్తున్న మహేష్.. ఏమిటో తెలుసా?

ఈ సినిమాకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి అప్డేట్ వస్తుందా అని అభిమానులు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నారు. అయితే, తాజాగా ఈ సినిమా సెట్స్ నుండి ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో మలయాళ నటుడు జయరామ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా ఈ ఫోటో చూస్తుంటే అర్థమవుతోంది. దర్శకుడు త్రివిక్రమ్, హీరో మహేష్‌తో కలిసి జయరామ్ దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఈ ఫోటోలో మహేష్ లుక్ కూడా రివీల్ కావడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

SSMB28: మహేష్ మూవీ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్న త్రివిక్రమ్!

ఇక ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను ఉగాది పర్వదినం సందర్భంగా రివీల్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోన్నట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మార్చి 22న ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు టైటల్‌ను కూడా రివీల్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోన్నట్లుగా తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోండగా, ఆగస్టు 11న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.