SSMB 28: మహేష్-త్రివిక్రమ్-పూజా.. హ్యాట్రిక్ సినిమాపై భారీ అంచనాలు

మహేశ్ బాబు షూటింగ్ షెడ్యూల్ కి కోవిడ్ వచ్చి కొంత బ్రేక్ వేసింది కానీ ప్రస్తుతం ఫుల్ వర్క్ మూడ్ లోకి వచ్చేశాడు ప్రిన్స్. మహేశ్ బాబు రంగంలోకి దిగితే తన దూకుడు ఎలా ఉంటుందో..

SSMB 28: మహేష్-త్రివిక్రమ్-పూజా.. హ్యాట్రిక్ సినిమాపై భారీ అంచనాలు

Ssmb 28

SSMB 28: మహేశ్ బాబు షూటింగ్ షెడ్యూల్ కి కోవిడ్ వచ్చి కొంత బ్రేక్ వేసింది కానీ ప్రస్తుతం ఫుల్ వర్క్ మూడ్ లోకి వచ్చేశాడు ప్రిన్స్. మహేశ్ బాబు రంగంలోకి దిగితే తన దూకుడు ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. సర్కార్ వారి పాట పూర్తవకుండానే రాజమౌళితో సినిమా చర్చల్లో పాల్గొంటున్నాడు. త్రివిక్రమ్ తో హాట్రిక్ సినిమా మొదలు పెట్టేశాడు. ఈ సినిమా మహేశ్ బాబు అభిమానులకు ఓ స్పెషల్ మూవీ కానుంది.

Aadavallu Meeku Joharlu: టైటిల్ సాంగ్ రిలీజ్.. దేవిశ్రీ మార్క్ కిర్రాక్ అంతే!

సినిమాకు కథ ఎంత ముఖ్యమో కాంబినేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. సూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుంచి ఈ సినిమా పై ఇటు సినీ వర్గాల్లో, అటు మహేశ్ బాబు అభిమానుల్లో స్పెషల్ అటెన్షన్ క్రియేట్ అయింది. ఇప్పడు వీళ్ల కలయికలో వచ్చే హాట్రిక్ సినిమా కావడంతో ఈ సినిమాను స్పీడప్ చేస్తున్నాడు మహేశ్. పూజా హెగ్డేపై మొదలైన ముహూర్తపు షాట్ తో క్యూరియాసిటీ మరింత పెరిగింది. ఈ హిట్ కాంబినేషన్ లో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Allu Arjun: బన్నీ కొత్త యాడ్.. మొన్న బస్ ఎక్కమని.. నేడు తినమని!

మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్ కి క్రేజ్ పీక్స్ లో ఉంది. వీళ్ల కలయికలో అతడు, ఖలేజా లాంటి సినిమాలు వచ్చి దశాబ్ధ కాలమైనా ఇప్పటికీ ఆడియన్స్ ను అలరిస్తూనే ఉన్నాయి. అతడులో ప్రొఫెషనల్ కిల్లర్ గా సెటిల్డ్ పెర్ఫామెన్స్ ఇచ్చే క్యారెక్టర్ తో మహేశ్ బాబును ఎట్రాక్టివ్ గా ఢీల్ చేసిన త్రివిక్రమ్ ఖలేజాలో కంప్లీట్ చేంజ్ చేశాడు. ఈజీ గోయింగ్ కామెడి టైమింగ్ ఉన్న క్యారెక్టర్ డిజైన్ చేశాడు. దాంతో ఆ రెండు సినిమాలు ఇప్పటికీ ఎంటర్ టైన్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ థర్డ్ మూవీలో మహేశ్ ను కొత్తగా ప్రజెంట్ చేస్తాడని.. త్రివిక్రమ్ తో మహేశ్ బాబు హాట్రిక్ హిట్ కొడతాడని లెక్కలేసుకుంటున్నారు మహేశ్ ఫాన్స్.

Bhumi Pednekar: అందాలు అస్సలు దాచుకొని భూమి!

మహేశ్ బాబు కెరీర్ లో హీరోగా 28వ సినిమా, పూజా హెగ్డేతో మహేశ్ బాబుకిది రెండో సినిమా. పూజా హెగ్డేతో జత కట్టిన మహేశ్ బాబు మహర్షితో హిట్ కొట్టాడు. పూజా హెగ్డే, మహేశ్ బాబుల మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కవుతుందని ప్రూవ్ అయ్యింది. త్రివిక్రమ్ కూడా పూజా హెగ్డేతో ఆల్రెడీ రెండు సినిమాలు చేశాడు. అరవింద సమేత, అలవైకుంఠ పురంలో ఆ రెండూ బ్లాక్ బస్టర్ హిట్సే. సో ఇటు మహేశ్ బాబుతో, అటు పూజా హెగ్డేతో త్రివిక్రమ్ కి ఇది హాట్రిక్ సినిమా అవుతుంది. ఎటు చూసినా సూపర్ హిట్ కాంబినేషన్ తో వస్తోన్న సినిమా కాబట్టి సినీ అభిమానులు ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసుకుంటున్నారు.