Video: వింతగా నడిచిన మలైకా అరోరా.. ట్రోలింగ్ చేస్తున్న నెటిజన్లు
మలైకా అరోరా.. ఏదో ఒక కారణంతో నిరంతరం వార్తలలో నిలుస్తూ ఉంటుంది. మలైకా ఏమి చేసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Malaika Arora: మలైకా అరోరా.. ఏదో ఒక కారణంతో నిరంతరం వార్తలలో నిలుస్తూ ఉంటుంది. మలైకా ఏమి చేసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మలైకా అరోరా లేటెస్ట్ వీడియో కూడా ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. బాలీవుడ్ ఫిట్నెస్ నటీమణులలో ఒకరైన మలైకా అరోరాని ఫిట్నెస్ ఫ్రీక్‌గా పిలుస్తూ ఉంటారు.
ప్రతి రోజూ యోగా చేస్తుండే మలైకా.. బోల్డ్ డ్రెస్సింగ్ స్టైల్‌తో హెడ్‌లైన్స్‌లో నిలుస్తూ ఉంటుంది. కొన్నిసార్లు బట్టల కారణంగా ట్రోలింగ్ ఎదుర్కోవలసి వస్తుంది కూడా. లేటెస్ట్గా మలైకా తన యోగా క్లాస్ బయటకు వచ్చిన తర్వాత ఫోటోగ్రాఫర్లు క్లిక్ అనిపించారు. ఆమె మారిన నడక మరియు బట్టల కారణంగా ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
మలైకా ఈ వీడియోలో కారు నుంచి దిగిన ఇంటి వైపు వెళుతోంది. తన జిమ్ దుస్తుల్లో కనిపించగా.. మలైకా నడకపై, డ్రెస్సింగ్‌పై ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఈ వీడియోలో, మలైకా పోజ్ చూస్తుంటే, చాలా వింతగా, ఫన్నీగా కనిపిస్తుంది. యోగా క్లాస్ వెలుపల నల్ల క్రాప్ టాప్ మరియు సగం టైట్ ప్యాంటు ధరించి మలైకా కనిపించింది. మలైకా కారు నుండి దిగినప్పుడు, ఆమె నడక మారినట్లు కనిపించింది, అది కాస్త సరదాగా ఉండడంతో దారుణంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు నెటిజన్లు. భారత తదుపరి సూపర్ మోడల్ మలైకా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram