Malaika Arora : నేనేం బట్టలు వేసుకోవాలో నాకు తెలుసు

మలైకాని ఈ ఏజ్ లో ఇలాంటి డ్రెస్సులేంటి అంటూ చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తారు. తాజాగా ఇలాంటి కామెంట్లపై మలైకా అరోరా ఓ ఇంటర్వ్యూలో ఫైర్ అయింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.......

Malaika Arora :  నేనేం బట్టలు వేసుకోవాలో నాకు తెలుసు

Malaika Arora

Malaika Arora :   బాలీవుడ్‌ భామ మలైకా అరోరా ఇటీవల వార్తల్లో ఎక్కువగా నిలుస్తుంది. 48 ఏళ్ల వయసులో కూడా యువ హీరోయిన్స్ కి ధీటుగా ఆమె ఫిజిక్‌ మెయింటైన్‌ చేస్తుంది. తన కంటే చిన్నవాడు హీరో అర్జున్ కపూర్ తో డేటింగ్ కూడా చేస్తుంది. దీని గురించి ఇప్పటికే చాలా సార్లు చెప్పింది. ఈ విషయంలో కూడా నీకంటే చాలా తక్కువ వయసు ఉన్నవాళ్ళతో డేటింగ్ ఏంటి అని అంటే గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఇక బాలీవుడ్ భామల డ్రెస్సులు గురించి తెలిసిందే. డ్రెస్సులు వేస్తే తమ శరీరం ఎక్కడ అరిగిపోద్ది అన్నట్టు వేస్తారు. మలైకాని ఈ ఏజ్ లో ఇలాంటి డ్రెస్సులేంటి అంటూ చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తారు. తాజాగా ఇలాంటి కామెంట్లపై మలైకా అరోరా ఓ ఇంటర్వ్యూలో ఫైర్ అయింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన డ్రెస్సింగ్‌ పై వచ్చిన విమర్శలపై ఘాటుగానే స్పదించింది.

Samantha : మరోసారి ఐటెం సాంగ్ చేయబోతున్న సమంత??

మలైకా అరోరా మాట్లాడుతూ… ”ఒక స్త్రీని ఎల్లప్పుడూ ఆమె ధరించే స్కర్ట్ పొడవు లేదా ఆమె నెక్‌లైన్‌ని బట్టి అంచనా వేస్తారు ఈ జనాలు. ఇలాంటి జనాల అభిప్రాయాలకు అనుగుణంగా నా జీవితాన్ని నేను గడపలేను. ఎందుకంటే డ్రెస్సింగ్ అనేది నా వ్యక్తిగత ఎంపిక. నాకు నా సొంతంగా ఆలోచనలు, ఎంపికలు ఉంటాయి. అలాగే నేను ఎవరి డ్రెస్సింగ్ గురించి మాట్లాడను. నేను ఎలాంటి దుస్తులు ధరించాలి? ఏ డ్రెస్‌ నాకు సెట్‌ అవుతుందో, ఏది బాగోదో నాకు తెలుసు. నేను వేసుకున్న డ్రెస్ నాకు నచ్చకపోతే నేనే మార్చుకుంటాను. అప్పుడు కూడా అది నా ఎంపికే. కాబట్టి దాని గురించి నాకు చెప్పే హక్కు ఎవరికీ లేదు. ప్రస్తుతం నా వయసుకి, నేను ధరించే దుస్తుల పట్ల నాకు సౌకర్యంగానే ఉంది. నేను తెలివితక్కువదానిని కాదు. ఎలా ఉండాలో, ఏం చేయాలో నాకు తెలుసు. నాకు నచ్చినట్లుగా నేను ఉంటాను” అంటూ మలైకా తన డ్రెస్సులపై కామెంట్లు చేసే వాళ్లపై ఫైర్ అయింది.