Bigg Boss 5 : మానస్ ప్రియాంకలకి పెళ్లి చేసిన బిగ్ బాస్

మానస్‌.. నేను ఎక్కువగా అలుగుతాను, అప్పుడు తనే ముందుగా నన్ను బుజ్జగించాలి. ఇద్దరి కుటుంబాలను ప్రేమగా చూసుకోవాలి అని తెలిపాడు. ప్రియాంక.. అబ్బాయి నాకంటే ఎక్కువ హైట్‌ ఉండాలి.

Bigg Boss 5 : మానస్ ప్రియాంకలకి పెళ్లి చేసిన బిగ్ బాస్

Bb5

Bigg Boss 5 :  బిగ్ బాస్ లో కొన్ని రోజులు అందరూ గొడవ పడుతారు. కొన్ని రోజులు కలిసి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. మొన్నటి దాకా కెప్టెన్సీ కోసం అందరు గొడవ పడ్డారు. ఈ వారం వీజే సన్నీ కెప్టెన్ గా ఎన్నికయ్యాడు. దీంతో ఇంకో రెండు మూడు రోజుల వరకు గేమ్ లో ఎక్కువ గొడవలు ఉండకపోవచ్చు.

తాజాగా నిన్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి సరైన మ్యాచ్ ని వెతకండి అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో హౌస్‌లోని మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్స్‌ వాళ్ళకి కాబోయే భాగస్వామికి ఎలాంటి లక్షణాలు ఉండాలో చెప్పాలి. ముందుగా శ్రీరామ్‌.. తనను పెళ్లాడే అమ్మాయి బబ్లీగా, అందర్నీ అల్లుకుపోయేలా ఉండాలన్నాడు. ఇక సన్నీ.. నమ్మకం, నిజాయితీ, అర్థం చేసుకునే స్వభావం తనకు కాబోయే అమ్మాయిలో తప్పకుండా ఉండాలి అని చెప్పాడు. అంతే కాక ఎంతో కేరింగ్‌ చూపించే ప్రియాంక లాంటి అమ్మాయిని ఎవరు చేసుకున్నా అదృష్టవంతులేనని చెప్పాడు.

Nayanatara : ఆస్కార్ బరిలో నయనతార సినిమా

మానస్‌.. నేను ఎక్కువగా అలుగుతాను, అప్పుడు తనే ముందుగా నన్ను బుజ్జగించాలి. ఇద్దరి కుటుంబాలను ప్రేమగా చూసుకోవాలి అని తెలిపాడు. ప్రియాంక.. అబ్బాయి నాకంటే ఎక్కువ హైట్‌ ఉండాలి. మంచివాడయి ఉండాలి, అర్థం చేసుకోవాలి, వాళ్ల ఫ్యామిలీని నా ఫ్యామిలీలా చూసుకుంటాను, నా దగ్గర బోలెడంత ప్రేమ ఉంది, అది అతడికి ఇచ్చేస్తాను అని చెప్పింది. షణ్ముఖ్.. నా గర్ల్‌ఫ్రెండ్‌ నన్నే చూడాలి, ఇంకెవర్నీ చూడకూడదు అని చెప్పాడు. సిరి.. నా దగ్గర అస్సలు పొగరు చూపించకూడదు అని చెప్పింది.

Anasuya : తమన్నాని రీప్లేస్ చేసిన అనసూయ.. తమన్నా కంటే రంగమ్మత్త రేంజ్ ఎక్కువ??

ఇంటి సభ్యులంతా ప్రియాంక – మానస్‌ను బెస్ట్‌ కపుల్‌గా ఎన్నుకున్నారు. దీంతో బిగ్‌బాస్‌ వారిద్దరూ పూలదండలు మార్చుకునేలా చేసి పెళ్లి జరిపించేశాడు. అనంతరం వీళ్లిద్దరూ ‘గువ్వా గోరికంతో’ పాటకు జంటగా స్టెప్పులేసి అదరగొట్టారు.