Manchu Manoj Marriage : అప్పుడు భూమా పెళ్లికి అతిధిగా.. ఇప్పుడు వరుడిగా.. ఫోటో వైరల్!

మంచు మనోజ్, భూమా మౌనిక ఈరోజు పెళ్లితో ఒకటి కాబోతున్నారు. కాగా వీరిద్దరికి గతంలోనే విడివిడిగా వివాహం అయ్యింది. 2015 లో మనోజ్ - ప్రణతి రెడ్డిని, మౌనిక - గణేష్ రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే..

Manchu Manoj Marriage : అప్పుడు భూమా పెళ్లికి అతిధిగా.. ఇప్పుడు వరుడిగా.. ఫోటో వైరల్!

Manchu Manoj Marriage

Manchu Manoj Marriage : మంచు కుటుంబం, భూమా కుటుంబం ఒకటవబోతున్నారు అంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. మంచు వారసుడు మనోజ్.. ప్రముఖ దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి కూతురు మౌనిక రెడ్డితో సహజీవనం చేస్తున్నాడంటూ వార్తలు వచ్చినా.. వాటి పై మనోజ్ గాని, ఇరువురి కుటుంబాలు గాని ఎక్కడా నోరు విప్పలేదు. ఇక ఇటీవల మనోజ్ మీడియాతో మాట్లాడుతూ త్వరలో కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నట్లు చెప్పడంతో, వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ కథనాలు కూడా వచ్చాయి.

Manchu Manoj Marriage : తను చేసుకోబోయే వధువుని పరిచయం చేసిన మంచు మనోజ్.. పెళ్లికూతురు ఫోటో చూశారా?

నేడు (మార్చి 3) ఆ వార్తలు అన్నిటిని నిజం చేస్తూ.. మనోజ్ అండ్ మౌనిక పెళ్లితో ఒకటి కాబోతున్నారు. ఈరోజు ఉదయం ఈ విషయాన్ని తెలియజేస్తూ మనోజ్ తన సోషల్ మీడియా ద్వారా వధువు ఫోటో షేర్ చేస్తూ.. ‘పెళ్లికూతురు భూమా మౌనిక రెడ్డి. మనోజ్ వెడ్స్ మౌనిక’ అంటూ ట్వీట్ చేశాడు. ఈరోజు రాత్రి మంచు వారి ఇంటి వద్దనే ఈ వివాహం జరగనుంది. కాగా వీరిద్దరికి గతంలోనే విడివిడిగా వివాహం అయ్యింది. 2015 లో మనోజ్ – ప్రణతి రెడ్డిని, మౌనిక – గణేష్ రెడ్డిని పెళ్లి చేసుకున్నారు.

ఇక్కడ విశేషం ఏంటంటే మౌనిక రెడ్డి వివాహానికి మనోజ్ గెస్ట్ గా వెళ్ళాడు. కట్ చేస్తే ఇప్పుడు మౌనిక రెడ్డికి వరుడిగా వస్తున్నాడు. మౌనిక రెడ్డి పెళ్ళికి మనోజ్ హాజరయిన అప్పటి ఫోటోలను షేర్ చేస్తూ.. అప్పుడు అతిధిగా, ఇప్పుడు వరుడిగా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా మంచు లక్ష్మి తన ముద్దులు తమ్ముడు మనోజ్ పెళ్లిని దగ్గర ఉండి చూసుకుంటుంది. అయితే ఈ పెళ్ళికి సినీ మరియు రాజకీయం రంగం నుంచి ఎవరెవరు హాజరు కాబోతున్నారు అనేది అందరిలో ఆసక్తిని రేపుతోంది.