Manchu Manoj Marriage : మంచు వారింట పెళ్లి పనులు.. భూమా మౌనికతో మంచు మనోజ్ పెళ్లి ఆ రోజేనా?

తాజాగా మంచు మనోజ్, భూమా మౌనిక పెళ్లి మార్చ్ 3న జరగనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఓ పూజా కార్యక్రమం కూడా నిర్వహించినట్టు సమాచారం. మంచు ఫ్యామిలీ అంతా ఒక్కచోటే ఉండి ఈ పెళ్లి కార్యక్రమాలు...................

Manchu Manoj Marriage : మంచు వారింట పెళ్లి పనులు.. భూమా మౌనికతో మంచు మనోజ్ పెళ్లి ఆ రోజేనా?

Manchu Manoj's wedding with Bhuma Mounika will take place on March 3

Manchu Manoj Marriage :  మంచు వారసుడు మంచు మనోజ్ కొన్ని సినిమాలతో ప్రేక్షకులని మెప్పించి మంచు ఫ్యామిలీ ఫ్యాన్స్ నుంచే కాక బయట నుంచి కూడా అభిమానులని సంపాదించుకున్నాడు. మంచు ఫ్యామిలిలో అందర్నీ సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ చేస్తారని తెలిసిందే. కాని ఇందుకు మంచు మనోజ్ మాత్రం మినహాయింపు. మంచు మనోజ్ చివరగా 2017లో ఒక్కడు మిగిలాడు సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఆ తర్వాత ఒక రెండు సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చినా అప్పట్నుంచి మంచు మనోజ్ సినిమాలకు దూరంగానే ఉన్నాడు. మనోజ్ వెండితెరపై కనపడి దాదాపు ఐదేళ్లు అయిపోయింది. మనోజ్ బయట కూడా ఎక్కువగా కనపడడు. గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న మంచు మనోజ్ ఇటీవలే ఓ సినిమాని ప్రకటించి త్వరలోనే వస్తున్నాను అని తెలిపాడు. మరి ఈ సినిమా ఎప్పటికి వస్తుందో చూడాలి.

సినిమాలకు దూరంగా ఉన్నా గత కొన్ని నెలలుగా మాత్రం మంచు మనోజ్ మళ్ళీ వార్తల్లో నిలుస్తున్నాడు. గతంలో మంచు మనోజ్ ఓ అమ్మాయిని పెళ్లి చేసుకొని తనకి విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల మనోజ్ మళ్ళీ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. గత సంవత్సరం వినాయకచవితికి వీరిద్దరూ కలిసి ఓ గణేష్ మండపం వద్దకు వెళ్లి పూజలు కూడా చేశారు. దీంతో ఈ వార్తలు మరింత ఎక్కువయ్యాయి. ఇక ఓ మాజీ ఎమ్మెల్యే వీరిద్దరి గురించి మాట్లాడుతూ గతంలో ప్రేమించుకున్నారు, కాని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఇద్దరికీ వేరువేరుగా పెళ్లిళ్లు అయి ఇద్దరూ విడిపోవడంతో మళ్ళీ మనోజ్, మౌనిక పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. వీరిద్దరూ ప్రస్తుతం కలిసే ఉంటున్నారు అని వ్యాఖ్యలు చేయడంతో ఇవి వైరల్ గా మారాయి.

Naseeruddin Shah : సౌత్ సినిమాలు హిట్ అవుతాయేమో కానీ.. సౌత్ మూవీస్ పై విమర్శలు చేసిన బాలీవుడ్ స్టార్ నటుడు..

తాజాగా మంచు మనోజ్, భూమా మౌనిక పెళ్లి మార్చ్ 3న జరగనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఓ పూజా కార్యక్రమం కూడా నిర్వహించినట్టు సమాచారం. మంచు ఫ్యామిలీ అంతా ఒక్కచోటే ఉండి ఈ పెళ్లి కార్యక్రమాలు జరిపిస్తున్నట్టు తెలుస్తోంది. మంచు మనోజ్, మౌనిక ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడంతో కేవలం కుటుంబ సభ్యుల మధ్యే ఈ పెళ్లి జరగనుందని తెలుస్తుంది. దీనిపై అధికారిక సమాచారం లేకపోయినా మంచు కుటుంబ సన్నిహితులు మార్చ్ 3న మంచు మనోజ్ పెళ్లి జరగబోతున్నట్టు తెలిపారు. దీంతో ఈ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది.