Mandakini : ఆహాలో సరికొత్త సీరియల్ మందాకిని.. ఫ్రీగా చూసేయండి..

తాజాగా ఆహా నుంచి మరో డైలీ సీరియల్ స్టార్ట్ అయింది. మందాకిని అనే పేరుతో సరికొత్త సీరియల్ స్టార్ట్ అయింది. మనిషి మేధస్సుకి, దైవ శక్తికి మధ్య జరిగే సంఘర్షణ అనే పాయింట్ తో దీనిని ప్రమోట్ చేస్తున్నారు. మైథాలజీ, సస్పెన్స్, హారర్, థ్రిల్లర్, లవ్ అంశాలతో ఈ సీరియల్...............

Mandakini : ఆహాలో సరికొత్త సీరియల్ మందాకిని.. ఫ్రీగా చూసేయండి..

Mandakini serial streaming in Aha everyday first 8 episodes free watchable

Mandakini :  తెలుగు ఓటీటీ ఆహా రకరకాల కొత్త సినిమాలు, షోలు, సిరీస్ లతో ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుంది. తెలుగు ఇండియన్ ఐడల్, అన్ స్టాపబుల్, చెఫ్ మంత్ర, సర్కార్, కామెడీ స్టాక్ ఎక్స్ చేంజ్.. లాంటి పలు కొత్త రకాల షోలు ఆహాకి విశేష ప్రజాదరణ తెచ్చిపెట్టాయి. కొన్ని రోజుల క్రితం మొదలుపెట్టిన మిస్టర్ పెళ్ళాం అనే కామెడీ సీరియల్ కూడా మంచి ప్రజాదరణ తెచ్చుకుంటుంది. ఈ సీరియల్ ని ఆహా ఫ్రీగా స్ట్రీమింగ్ చేయడం విశేషం. దీంతో ఫ్రీగా మిస్టర్ పెళ్ళాం సీరియల్ ని చూస్తున్నారు ప్రేక్షకులు.

తాజాగా ఆహా నుంచి మరో డైలీ సీరియల్ స్టార్ట్ అయింది. మందాకిని అనే పేరుతో సరికొత్త సీరియల్ స్టార్ట్ అయింది. మనిషి మేధస్సుకి, దైవ శక్తికి మధ్య జరిగే సంఘర్షణ అనే పాయింట్ తో దీనిని ప్రమోట్ చేస్తున్నారు. మైథాలజీ, సస్పెన్స్, హారర్, థ్రిల్లర్, లవ్ అంశాలతో ఈ సీరియల్ ఉండబోతుంది. ట్రైలర్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. మార్చ్ 6 నుంచి మందాకిని సీరియల్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. సోమవారం నుంచి గురువారం వరకు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు ప్రతి రోజు కొత్త ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.

Kiara-Sidharth : భర్త సిద్దార్థ్ గురించి కియారా ఏం చెప్పిందో తెలుసా?

అయితే ఆహాలో మిస్టర్ పెళ్ళాం సీరియల్ పూర్తిగా ఫ్రీగా చూసేయొచ్చు. ఈ మందాకిని సీరియల్ మాత్రం మొదటి 8 ఎపిసోడ్స్ ని ఫ్రీగా చూసేయొచ్చు. ఆ తర్వాత చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. ఆహా టీం మహా మార్చ్ అంటూ సబ్‌స్క్రిప్షన్ ఫీజ్ తగ్గించింది ఇప్పుడు కేవలం 299 రూపాయలకే సంవత్సరం అంతా ఆహాలో అన్నీ చూసేయొచ్చు.