Manushi Chillar : ఈ మిస్‌వరల్డ్ కి రామ్‌చరణ్‌తో కలిసి డేటింగ్ చేయాలని ఉందట..

మానుషి చిల్లర్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''RRR చూశాక చరణ్‌కు ఫ్యాన్‌ అయిపోయాను. చరణ్ తో కలిసి వర్క్ చేయాలని ఉంది. రామ్ చరణ్ కి పెళ్లి..................

Manushi Chillar : ఈ మిస్‌వరల్డ్ కి రామ్‌చరణ్‌తో కలిసి డేటింగ్ చేయాలని ఉందట..

Ram Charan

Updated On : June 3, 2022 / 6:36 AM IST

Manushi Chillar :  మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి మానుషి చిల్లర్‌ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది. జూన్ 3న అక్షయ్ హీరోగా, మానుషి హీరోయిన్ గా నటించిన పృథ్వీరాజ్ సినిమా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అవ్వనుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో మానుషి చిల్లర్ పలు ఆసక్తికర విషయాలని తెలియచేసింది.

SP Balu : బాలుకి ప్రేమతో.. 100 మంది.. 12 గంటల పాటు నాన్ స్టాప్ సింగింగ్..

 

మానుషి చిల్లర్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”RRR చూశాక చరణ్‌కు ఫ్యాన్‌ అయిపోయాను. చరణ్ తో కలిసి వర్క్ చేయాలని ఉంది. రామ్ చరణ్ కి పెళ్లి కాకపోయి ఉంటే నేనే స్వయంగా డేట్‌కి వెళ్దామా అని చరణ్‌ను అడిగేదాన్ని. రామ్ చరణ్ నాతో డేటింగ్ కి ఒప్పుకుంటే కలిసి సినిమాలు చూస్తాం, ఇష్టమైన ఫుడ్‌ తింటాం, ఇంకా ఎన్నెన్నో వియాలను మాట్లాడుకుంటాం” అని తెలిపింది. డేటింగ్ సంగతి ఏమో కానీ గట్టిగా ట్రై చేస్తే రామ్ చరణ్ సినిమాలో నటించే అవకాశం మాత్రం వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు ఇంటర్వ్యూ చూసిన వాళ్లంతా.