Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌లో టెన్షన్.. ఎందుకో తెలుసా?

హీరో ప్రభాస్ ఫ్యాన్స్ బాహుబలి సిరీస్ సినిమాలతో తమ హీరో స్టామినా ఏమిటో ఈ ప్రపంచానికి తెలిసిందని కాలర్ ఎగరేసి మరీ చెప్పిన రోజులు అందరికీ తెలిసిందే.....

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌లో టెన్షన్.. ఎందుకో తెలుసా?

Maruthi Creates Tension In Prabhas Fans With Pakka Commercial

Prabhas: హీరో ప్రభాస్ ఫ్యాన్స్ బాహుబలి సిరీస్ సినిమాలతో తమ హీరో స్టామినా ఏమిటో ఈ ప్రపంచానికి తెలిసిందని కాలర్ ఎగరేసి మరీ చెప్పిన రోజులు అందరికీ తెలిసిందే. అయితే ఆ తరువాత ప్రభాస్ నుండి వచ్చిన రెండు సినిమాలు కూడా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో ప్రభాస్ మళ్లీ బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఎప్పుడు చాటుతాడా అని ఆతృతగా చూస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్‌ను మరో కొత్త విషయం టెన్షన్ పెడుతోంది. ఇంతకీ ప్రభాస్ ఫ్యాన్స్ ఏ విషయంలో టెన్షన్ పడుతున్నారో తెలుసా?

Prabhas: ప్రభాస్ మారుతి సినిమా వచ్చేది అప్పుడేనా?

ప్రభాన్ నెక్ట్స్ మూవీలన్నీ ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఆదిపురుష్ మినహా సలార్, ప్రాజెక్ట్K.. ఇలా అన్ని సినిమాలు కూడా షూటింగ్ జరుపుకుంటున్నాయి. అయితే ఈ సినిమాలన్నీ రిలీజ్ కావాలంటే చాలా సమయం పడుతుందని భావించిన ప్రభాస్, ఓ మీడియం రేంజ్ మూవీని వీలైనంత తక్కువ టైమ్‌లో తెరకెక్కించి, రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాడు. దీనికోసం దర్శకుడు మారుతితో కథా చర్చలు కూడా జరిపాడు. ఇక ఈ ప్రాజెక్టును అఫీషియల్‌గా అనౌన్స్ చేయడం ఒకటే మిగిలి ఉంది. ఇదిలా ఉండగా.. దర్శకుడు మారుతి తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘పక్కా కమర్షియల్’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Prabhas : మరో ప్రాజెక్టుకి లైన్ క్లియర్ చేసిన ప్రభాస్.. ఈ లైనప్ ఏంటి బాబు..

మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా వచ్చిన ఈ సినిమాను రొటీన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా మారుతి తెరకెక్కించడంతో ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్‌కు అంతగా కిక్కివ్వలేదు. దీంతో తమ హీరోతో మారుతి ఇలాంటి సినిమానే తీస్తే పరిస్థితి ఏమిటని ఇప్పుడు వారు టెన్షన్ పడుతున్నారు. అసలే తమ హీరో సాహో, రాధేశ్యామ్ వంటి రెండు డిజాస్టర్ల తరువాత ఆదిపురుష్ అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాను పక్కనబెడితే స్ట్రెయిట్ తెలుగు సినిమాగా మారుతితో చేయబోయే సినిమానే ముందుగా రానుంది. ప్రభాస్ కోసం మారుతి ఎలాంటి కథను తెస్తాడా అని ఇప్పుడు వారిని కొత్త టెన్షన్ వెంటాడుతోంది. మరి నిజంగానే ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్ పడేలా మారుతి రొటీన్ కథతో వస్తాడా.. లేక ప్రభాస్ కోసం సరికొత్త కథను తెరకెక్కిస్తాడా అనేది చూడాలి.