Maruthi: మెగా లోటు తీరుస్తానంటోన్న మారుతి..?

టాలీవుడ్‌లో చిన్న సినిమాల దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్న మారుతి, ప్రస్తుతం మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. రీసెంట్‌గా ఆయన మ్యాచో స్టార్....

Maruthi: మెగా లోటు తీరుస్తానంటోన్న మారుతి..?

Maruthi Planning Entertainment For Chiranjeevi

Maruthi: టాలీవుడ్‌లో చిన్న సినిమాల దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్న మారుతి, ప్రస్తుతం మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. రీసెంట్‌గా ఆయన మ్యాచో స్టార్ గోపీచంద్‌తో పక్కా కమర్షియల్ అనే సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో మారుతి తన నెక్ట్స్ చిత్రాన్ని ఎవరితో చేస్తాడా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

Director Maruthi : అటు ప్రభాస్.. ఇటు చిరంజీవి.. మధ్యలో మారుతి..

కాగా, గతంలో మారుతి మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేయబోతున్నాడనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపించింది. ఇప్పుడు ‘పక్కా కమర్షియల్’ ఫ్లాప్‌తో మారుతి మెగాస్టార్ కాంబినేషన్‌లో సినిమా రావడం అసంభవం అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ.. ఈ ప్రాజెక్టు ఎక్కడికీ పోలేదని, మెగాస్టార్ స్వయంగా మారుతితో సినిమా చేసేందుకు ఆసక్తిని చూపుతున్నట్లుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్స్‌ను బాగా చూపించడంలో మారుతి తనదైన మార్క్ వేసుకున్నాడు. అటు చిరంజీవి కమ్‌బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 తరువాత ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలే చేయలేదు. సైరా నరసింహా రెడ్డి, ఆచార్య చిత్రాల్లో ఆయన రొమాన్స్, డ్యాన్స్ వంటివి ఎక్కువగా చేయలేకపోయారు. అటు గాడ్‌ఫాదర్ సినిమాలో కూడా ఆయనకు హీరోయిన్ లేదు. దీంతో చిరు తన అభిమానులకు పాత చిరంజీవిని మరోసారి చూపించాలని కోరుకుంటున్నారు.

Director Maruthi : అలా చేస్తే పక్క భాషల నటుల్ని తెచ్చుకోవాల్సిన పని లేదు..

అందుకే, మారుతిని ఓ అదిరిపోయే ఎంటర్‌టైనింగ్ సబ్జెక్టును రెడీ చేయమని, అందులో రొమాన్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌లతో పాటు డ్యాన్స్ కూడా ఖచ్చితంగా ఉండాలని కోరాడట. ఇప్పుడు మారుతి ఇదే పనిలో బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక చిరు కోసం స్క్రిప్టును మారుతి ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో, వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు వస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.