Khiladi: మాస్ రాజా మొదలెట్టేశాడు.. మరో సింగిల్ వచ్చేస్తుంది!

మాస్ మహారాజా రవితేజ కొన్నాళ్ల క్రితం సక్సెస్ మీద సక్సెస్ కొడుతున్న టైంలో అతని పట్టుకోవడం.. తట్టుకోవడం కూడా కష్టమే అనిపించేది. అయితే.. ఇప్పుడు క్రాక్ సక్సెస్ తో మళ్ళీ..

Khiladi: మాస్ రాజా మొదలెట్టేశాడు.. మరో సింగిల్ వచ్చేస్తుంది!

Khiladi

Khiladi: మాస్ మహారాజా రవితేజ కొన్నాళ్ల క్రితం సక్సెస్ మీద సక్సెస్ కొడుతున్న టైంలో అతని పట్టుకోవడం.. తట్టుకోవడం కూడా కష్టమే అనిపించేది. అయితే.. ఇప్పుడు క్రాక్ సక్సెస్ తో మళ్ళీ ఆ రేంజ్ ఊపు కనిపిస్తుంది అతనిలో. మామూలుగానే రవితేజలో ఎనర్జీ లెవెల్స్ ఎక్కువని చెప్తారు. అలాంటి ఎనర్జీకి క్రాక్ సక్సెస్ తోడు కావడంతో ఆయన దూకుడు మామూలుగా లేదు. కరోనా తర్వాత ఈ ఏడాది మొట్టమొదటి తెలుగు బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన మాస్ మహారాజ అదే ఊపులో వరస సినిమాలను లైన్ లో పెట్టేశాడు.

Sai Pallavi: బుర్ఖా ధరించి ప్రేక్షకుల మధ్య సినిమా చూసిన హీరోయిన్!

ప్రస్తుతం రవితేజ చేతిలో అరడజను సినిమాలు ఉండగా అందులో నాలుగు సినిమాలు షూటింగ్ లో ఉండగా మరో రెండు సెట్స్ మీద ఉన్నాయి. రామారావు రావు ఆన్ డ్యూటీ.. ఖిలాడీ సినిమాలు ముమ్మర షూటింగ్ లో ఉండగా ఖిలాడీ నుండి ఇప్పటికే వచ్చిన రెండు పాటలు.. టీజర్లు సినిమా మీద ఆసక్తిని పెంచాయి. కాగా ఇప్పుడు ఈ సినిమా నుండి మరో సింగిల్ కూడా వచ్చేస్తుంది. అట్టసూడకే అనే పాటని డిసెంబర్ 31న విడుదల చేయనుండగా బుధవారం ఈ సాంగ్ టీజర్ ను విడుదల చేశారు.

RRR: తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు.. ఎక్కడ.. అసలు ఉంటుందా?

దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఏ స్టూడియోస్ పతాకంపై ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ లు సంయుక్తంగా నిర్మిస్తుండగా.. మీనాక్షి చౌదరీ, డింపుల్ హాయతీ రవితేజ సరసన హీరోయిన్ లుగా నటిస్తున్నారు. రవితేజ డ్యూయల్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమాలో సౌత్ ఇండస్ట్రీలోని నలుగురు టాప్ ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్, అన్బు-అరివు మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తుండడం విశేషం.