The Warrior: విజిల్ వేయిస్తున్న వారియర్.. ఎప్పుడంటే?

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది వారియర్’ ఇప్పటికే షూటింగ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తమిళ దర్శకుడు....

The Warrior: విజిల్ వేయిస్తున్న వారియర్.. ఎప్పుడంటే?

Mass Song From The Warrior To Get Released

The Warrior: యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది వారియర్’ ఇప్పటికే షూటింగ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ పోతినేని పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా, ఈ సినిమాలో ఆయన పాత్రలో ఎలాంటి వేరియేషన్స్ ఉంటాయా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.

The warrior : రామ్ కోసం.. 150 మంది డ్యాన్సర్లు, 100 మంది మోడల్స్..

ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. కాగా.. తాజాగా ఈ సినిమా నుండి మరో సర్‌ప్రైజ్‌ను ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాలో రామ్ సరసన అందాల భామ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్‌గా నిలుస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

The Warriorr: ఇస్మార్ట్ రామ్‌తో మాస్ లింగుస్వామి.. కసి మొత్తం చూపించేస్తారా?

కాగా.. ఈ సినిమా నుండి ‘‘విజిల్…’’ అంటూ ఓ మాస్ సాంగ్‌తో దూసుకొస్తున్నాడు రామ్. ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను జూన్ 22న సాయంత్రం 7.12 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. రామ్ సినిమాల్లో మాస్ పాటలకు ఎలాంటి ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. దీంతో ఈ విజిల్ పాట ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని యావత్ సినీ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, ఈ చిత్రాన్ని శ్రీనివాస చెట్టూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.