Meera Jasmine : బోయపాటి-రామ్ సినిమాలో మీరా జాస్మిన్?

తెలుగులో తక్కువ సినిమాలే చేసినా మంచి గుర్తింపు తెచ్చుకుంది మీరా జాస్మిన్. మలయాళంలో మాత్రం చాలానే సినిమాలు చేసింది. హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మారి..........

Meera Jasmine : బోయపాటి-రామ్ సినిమాలో మీరా జాస్మిన్?

Meera Jasmine (1)

Meera Jasmine :  ‘అమ్మాయి బాగుంది’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మలయాళీ ముద్దుగుమ్మ మీరా జాస్మిన్. ఆ తరువాత భద్ర, గుడుంబా శంకర్, పందెంకోడి లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులని అలరించింది. తెలుగులో తక్కువ సినిమాలే చేసినా మంచి గుర్తింపు తెచ్చుకుంది మీరా జాస్మిన్. మలయాళంలో మాత్రం చాలానే సినిమాలు చేసింది. హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మారి కొన్ని సినిమాల్లో మెప్పించింది మీరా జాస్మిన్. కొన్ని రోజులు సినిమాలకి దూరంగా ఉన్న మీరా ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీకి సిద్ధం అయింది.

ఇప్పటికే ఒక మలయాళం సినిమాలో నటించడానికి ఒప్పుకుంది. ఇక ఇటీవల తన ఇంస్టాగ్రామ్ లో 40 ఏళ్ళ వయసులోనూ బోల్డ్ ఫొటోలతో అదరగొడుతుంది. తనకేమి ఇంకా వయసు అయిపోలేదంటూ పిక్స్ తో హల్ చల్ చేస్తుంది. మీరా జాస్మిన్ ఈ పిక్స్ చూసి అయినా అవకాశాలు వస్తాయని తాను ఇదివరకులా బిజీ అవుతుందని ఆశిస్తుంది. ఆమె అనుకున్నట్టే అవకాశాలు ఒక్కొక్కటిగా తలుపు తడుతున్నట్టు తెలుస్తుంది.

Meera Jasmine : రీఎంట్రీ కోసం తహతహలాడుతున్న మీరా..

తాజాగా మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి సినిమాలో మీరా జాస్మిన్ ని ఓకే చేసినట్టు సమాచారం. యంగ్‌ హీరో రామ్‌ పోతినేనితో బోయపాటి ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ కూడా మొదలు పెట్టనున్నారని సమాచారం. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం బోయపాటి మీరా జాస్మిన్ ని కలిసి కథ వినిపించగా ఆమె ఓకే చేసినట్టు సమాచారం. ఇక బోయపాటి మొదటి సినిమా ‘భద్ర’లో మీరా జాస్మిన్ హీరోయిన్‌‌గా నటించిన సంగతి తెలిసిందే. అలాగే బాలకృష్ణ సినిమాలో కూడా ఒక క్యారెక్టర్ వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తానికి త్వరలోనే మీరా మళ్ళీ తెలుగు తెరపై మెరవనుంది.