Mega Family : మెగా – అల్లు ఫ్యామిలీల దీపావళి

సినీ సెలబ్రిటీలు పండగలని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక మెగా ఫ్యామిలీ గురించి చెప్పాల్సిన వసరం లేదు. ప్రతి పండగకి మెగా ఫ్యామిలీలో అందరూ కలిసి ఒకే చోట పండగని జరుపుకుంటారు. ఆ పండగ

Mega Family : మెగా – అల్లు ఫ్యామిలీల దీపావళి

Mega Family (1)

Mega Family :  సినీ సెలబ్రిటీలు పండగలని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక మెగా ఫ్యామిలీ గురించి చెప్పాల్సిన వసరం లేదు. ప్రతి పండగకి మెగా ఫ్యామిలీలో అందరూ కలిసి ఒకే చోట పండగని జరుపుకుంటారు. ఆ పండగ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తారు. ఆ ఆనంద సమయంలో దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటారు. మెగా ఫ్యామిలిలో హీరోలంతా ఒకే చోట కనిపిస్తే అభిమానులకి ఆనందం. చివరగా ఆగష్టులో రాఖి పండగకి అందరూ కలిసి మెగాస్టార్ ఇంట్లో పండగని జరుపుకున్నారు. మెగా హీరోలు, ఫ్యామిలీ అందరూ వచ్చి జరుపుకున్నారు. తాజాగా మరోసారి మెగా ఫ్యామిలీ దీపావళి ఒకే చోట చేసుకుంటున్నారు.

Bigg Boss 5 : ఇద్దరూ చెరో వైపు ముద్దు పెట్టండి : జెస్సి

అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ యంగ్ జనరేషన్ అంతా ఉన్న ఫోటోని షేర్ చేసి దీపావళి విషెస్ చెప్పాడు. నిన్న రాత్రే ఈ దీపావళి సెలబ్రేషన్స్ జరిగినట్టు తెలుస్తుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తో పాటు అల్లు అర్జున్ వైఫ్ స్నేహ‌, రామ్ చ‌ర‌ణ్‌ వైఫ్ ఉపాస‌న‌, అల్లు బాబీ, నిహారిక‌ – చైత‌న్య, వైష్ణ‌వ్ తేజ్, కళ్యాణ్ దేవ్, రామ్ చరణ్ సిస్టర్స్ ఇలా అల్లు – మెగా ఫ్యామిలీకి చెందిన యంగ్ జనేరేషన్ అంతా ఈ ఫొటోలో క‌నిపిస్తున్నారు. ఫ్యామిలీ పిల్లర్స్ ముగ్గురు మెగా బ్రదర్స్ మాత్రం ఈ సెలబ్రేషన్స్ కి రానట్టు తెలుస్తుంది. మరో వైపు ఇంకా విశ్రాంతి తీసుకుండటంతో సాయిధరమ్ తేజ్ కూడా రానట్టు తెలుస్తుంది.