Sridevi Shoban Babu: మెగా డాటర్ ఫస్ట్ లుక్.. అదిరిందిగా!

మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుండి ఇప్పటికే హీరోలు వస్తూనే ఉండగా.. కొత్తగా నిర్మాతలు కూడా తయారవుతున్నారు. చిరు పెద్ద కుమార్తె సుష్మిత నిర్మాతగా మారిన విషయం తెలిసిందే.

Sridevi Shoban Babu: మెగా డాటర్ ఫస్ట్ లుక్.. అదిరిందిగా!

Sridevi Shoban Babu

Sridevi Shoban Babu: మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుండి ఇప్పటికే హీరోలు వస్తూనే ఉండగా.. కొత్తగా నిర్మాతలు కూడా తయారవుతున్నారు. చిరు పెద్ద కుమార్తె సుష్మిత నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. తన భర్త విష్ణు ప్రసాద్‌తో కలిసి ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్’ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి ఇప్పటికే ‘షూట్-అవుట్ ఎట్ ఆలేరు’ అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ను నిర్మించారు.

కాగా, ప్రస్తుతం ‘శ్రీదేవి శోభన్ బాబు’ అనే టైటిల్‌తో సినిమా మొదలుపెట్టారు. ఈ మూవీలో సంతోష్ శోభన్ – గౌరీ కిషన్ జంటగా నటిస్తుండగా చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ‘శ్రీదేవి శోభన్ బాబు’ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. అలనాటి హిట్ పెయిర్ శోభన్ బాబు, శ్రీదేవి పేర్లతో ఈ సినిమా టైటిల్‌తో ఈ మూవీపై హైప్ క్రియేట్ చేశారు.

ఈ సినిమా ఫస్ట్ లుక్‌లో గౌరీ ట్రెండీ లుక్‌లో కనిపిస్తే.. హీరో సంతోష్ శోభన్ ఫార్మల్ షర్ట్‌తో రఫ్ లుక్‌తో ఉన్నారు. మరోవైపు ఒకప్పుడు మంచి క్రేజ్ ఉన్న జంట పేరుతో క్యాచీ టైటిల్ పెట్టారు. ఇంతకు ముందు చిరుకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన సుష్మిత.. ఈ మధ్యనే వెబ్ సిరీస్ తో అడుగుపెట్టగా.. ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో నిర్మాతగా ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మరి తొలి సినిమా మెగా డాటర్ కు ఎలాంటి అనుభవం తెచ్చిపెడుతుందో చూడాలి.