Mega Family: మెగా యంగ్ హీరోస్.. అంతా ఒకే ఫ్రేములో!

మెగా యంగ్ హీరోలంతా ఒకే ఫ్రేములో కనిపించి అభిమానులను సంతోషపెట్టారు.

Mega Family: మెగా యంగ్ హీరోస్.. అంతా ఒకే ఫ్రేములో!

Mega Family

Updated On : December 26, 2021 / 7:49 AM IST

Mega Family: మెగా యంగ్ హీరోలంతా ఒకే ఫ్రేములో కనిపించి అభిమానులను సంతోషపెట్టారు. క్రిస్‌మస్ సంధర్భంగా మెగా కుటుంబంలోని యంగ్ హీరోలంతా ఒకచోట చేరారు సందడి చేశారు.

దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఏ పండుగ వచ్చి మెగా కుటుంబం అంతా కలిసి ఒకేచోట చేరి సందడి చేయడం చూస్తూనే ఉంటాం.. లేటెస్ట్‌గా మెగా హీరోలు ఒకచోట కలుసుకుని కలిసి ఫోటో దిగారు.

ఈ ఫ్రేములో రామ్ చరణ్, తన భార్య ఉపాసన, అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డితో, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నిహారిక ఆమె భర్త చైతన్య, శ్రీజ, వైష్ణవ్ తేజ్ తదితరులు కనిపించారు. మెగా కజిన్స్ ఫోటోలో శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్, అల్లు శిరీష్ మాత్రం మిస్సయ్యారు.