Chiranjeevi: బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో మెగాస్టార్ దూకుడు!

ఒకప్పుడు సేఫ్ గా , కమర్షియల్ సినిమాలు మాత్రం చేసే చిరంజీవి సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేశాక కొత్త డైరెక్టర్లతో ప్రయోగాలు చేస్తున్నాడు. ఎప్పుడూ చెయ్యని కాంబినేషన్స్ ని తెరమీదకి..

Chiranjeevi: బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో మెగాస్టార్ దూకుడు!

Chiranjeevi (1)

Chiranjeevi: ఒకప్పుడు సేఫ్ గా , కమర్షియల్ సినిమాలు మాత్రం చేసే చిరంజీవి సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేశాక కొత్త డైరెక్టర్లతో ప్రయోగాలు చేస్తున్నాడు. ఎప్పుడూ చెయ్యని కాంబినేషన్స్ ని తెరమీదకి తీసుకొస్తున్నాడు. ఇప్పటికే మూడు సినిమాలతో బిజీగా ఉన్న మెగాస్టార్ మరో కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. తన సినిమాల బ్యాక్ టూ బ్యాక్ అప్ డేట్స్ తో పాటు టాలీవుడ్ లో ఎనర్జిటిక్ గా దూకుడుగా కనిపిస్తున్న చిరంజీవి చేతి నిండా సినిమాలతో బిజీగా మారిపోతున్నాడు.

RRR: బామ్మ ‘నాటు’ డాన్స్.. కేకో కేక..!

అటు సినిమాలతో పాటు ఏజ్ లో కూడా మ్యాజిక్ ఫిగర్ కి రీచ్ అవుతున్న మెగాస్టార్ వరుస సినిమాలతో మాంచి స్పీడ్ మీదున్నారు. ఆల్రెడీ ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో బిజీగా ఉన్న మెగాస్టార్ మొన్నీ మధ్యనే బాబీ సినిమా కూడా మొదలుపెట్టేశారు. లేటెస్ట్ గా మెహర్ రమేష్ తో భోళాశంకర్ సినిమా స్టార్ట్ చేశారు. ఈ గురువారం సినిమా ముహూర్తం మొదలుపెట్టిన టీమ్.. ఈ నెల 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ కి ప్లాన్ చేసుకున్నారు.

Bhagath Singh Nagar: భగత్‌సింగ్ నగర్ నుంచి శ్రీకాంత్ చేతుల మీదుగా సాంగ్

చిరంజవి, తమన్నా జంటగా కీర్తిసురేష్ సిస్టర్ రోల్ చేస్తున్న భోళా శంకర్ సినిమా తమిళ్ హిట్ మూవీ వేదాళంకి రీమేక్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఓపెనింగ్ గ్రాండ్ గా ఇండస్ట్రీ స్టార్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల మధ్య జరిగింది. మెహర్ రమేష్ డైరెక్షన్లో చిరంజీవి నటించడం ఇదే మొదటిసారి. అంతగా హిట్ ట్రాక్ లేని మెహర్ రమేష్ తో మెగాస్టార్ సినిమా చెయ్యడం, అదీ వేదాళం రీమేక్ కావడంతో ఈ భోళాశంకర్ మీద ఫస్ట్ నుంచీ ఇండస్ట్రీలో ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి.

Sanjay dutt : సంజయ్ దత్‌కు అరుదైన గౌరవం.. ఆఫ్రికా దేశం జాంజిబార్ కి టూరిజం అంబాసిడర్ గా ఎంపిక

సీనియర్ స్టార్ అయినా సినిమాల విషయంలో మాత్రం యంగ్ హీరోలకంటే ఎక్కువ దూకుడు చూపిస్తున్నారు. భోళాశంకర్ తో పాటు చిరంజీవి మొన్నీమధ్యనే బాబీతో సినిమా కూడా స్టార్ట్ చేశారు. అరాచకం ఆరంభం అంటూ సినిమా స్టార్ట్ చేసేటప్పుడే తెగ హడావిడి చేసిన బాబీ పూనకాలు లోడింగ్ అంటూ చిరంజీవి ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేశారు.

Janhvi Kapoor : జాన్వీ కపూర్ బికినీ షో… దుబాయ్ టూర్‌లో ధడక్ స్టార్ దూకుడు.. Photos

ఆల్రెడీ 4 సినిమాల్ని లైన్లో పెట్టిన చిరంజీవి.. వన్ బై వన్ కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆలస్యం అయ్యిందని ఆఘమేఘాల మీద ఆచార్యని కంప్లీట్ చేసిన మెగాస్టార్ మోహన్ రాజాతో గాడ్ ఫాదర్ ని కూడా సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్నారు. గాడ్ ఫాదర షూటింగ్ సగానికి పైగా అయిపోయినా.. దానికి కాస్త గ్యాప్ ఇచ్చి కొత్త సినిమాల్ని మొదలుపెట్టే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు చిరంజీవి.