Megastar’s GodFather: టైటిల్ పోస్టర్.. గాడ్ ఫాదర్‌గా మెగాస్టార్ చిరంజీవి!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వరుసగా సినిమాలతో దూసుకుని వెళ్తున్నారు.

Megastar’s GodFather: టైటిల్ పోస్టర్.. గాడ్ ఫాదర్‌గా మెగాస్టార్ చిరంజీవి!

God Father

Megastar’s GodFather: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వరుసగా సినిమాలతో దూసుకుని వెళ్తున్నారు. మెగా అభిమాన లోకాన్ని ఫిదా చేస్తున్న మెగాస్టార్.. విలక్షణ కథలతో అలరించేందుకు ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే మలయాళ ‘లూసిఫర్’ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్‌ని ఖరారు చేసింది చిత్రయూనిట్.

మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా పృథ్వీ రాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ‘లూసీఫర్’ని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఒరిజినల్ కథలో మార్పులు చేసి తెరకెక్కిస్తోంది చిత్రయూనిట్ చిరంజీవి పుట్టినరోజు సంధర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమా టైటిల్ విషయంలో అనేక పేర్లు పరిశీలించిన తర్వాత చివరకు ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ఫిక్స్ అయ్యారు.

ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 13 నుంచి మొదలు కానుండగా.. మోహన్ రాజా డైరెక్షన్‌లో, కొణిదెల ప్రొడక్షన్స్‌లో ఈ ప్రతిష్టాత్మక సినిమాకు ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. విద్యాబాలన్ మెగాస్టార్‌కి సిస్టర్‌గా ఈ సినిమాలో నటించబోతుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

1995లో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా వచ్చిన సినిమా గాడ్ ఫాదర్. యాక్షన్ డ్రామా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాని ప్రత్యూషా ప్రొడక్షన్స్ పతాకంపై కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించారు. వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్, కస్తూరి ప్రధాన పాత్రల్లో నటించగా.. రాజ్-కోటి సంగీతం అందించారు. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది.