Mehaboob Dilse : బిగ్‌బాస్ మెహబూబ్ కొత్త ఇల్లు హోమ్ టూర్..

బిగ్‌బాస్ నుంచి బయటకి వచ్చిన వాళ్లంతా సొంత ఇల్లు, కారు, బైక్ ఇలా ఎదో ఒకటి కొనుక్కుంటున్నారు. మెహబూబ్ కూడా బిగ్‌బాస్ నుంచి బయటకి వచ్చాక సొంత ఇల్లు కట్టుకోవడం మొదలు పెట్టాడు........

Mehaboob Dilse :  బిగ్‌బాస్ మెహబూబ్ కొత్త ఇల్లు హోమ్ టూర్..

Mehaboob

Mehaboob Dilse :  తెలుగు బిగ్‌బాస్ నాల్గవ సీజన్ లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ లో మెహబూబ్ ఒకరు. బిగ్‌బాస్ నుంచి పదవ వారంలో ఎలిమినేట్ అయ్యాడు. మెహబూబ్ గతంలో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ తో యూట్యూబర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్‌బాస్ తర్వాత కూడా అవే కంటిన్యూ చేశాడు. బిగ్‌బాస్ తర్వాత కూడా మెహబూబ్ కెరీర్ అంతకుముందులానే ఉంది. కెరీర్ పరంగా పెద్ద మార్పులు లేకపోయినా సోషల్ మీడియాలో, బయట పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇప్పుడు కూడా యూట్యూబ్ లో వీడియోస్ తో అలరిస్తున్నాడు.

 

ఇక బిగ్‌బాస్ నుంచి బయటకి వచ్చిన వాళ్లంతా సొంత ఇల్లు, కారు, బైక్ ఇలా ఎదో ఒకటి కొనుక్కుంటున్నారు. మెహబూబ్ కూడా బిగ్‌బాస్ నుంచి బయటకి వచ్చాక సొంత ఇల్లు కట్టుకోవడం మొదలు పెట్టాడు. అయితే మెహబూబ్ తన సొంతూరు గుంటూరులో ఇల్లు కట్టుకున్నాడు. గతంలోనే తాను సొంత ఇల్లు కట్టుకుంటున్నట్టు ఆ కంస్ట్రక్షన్ వీడియో కూడా షేర్ చేశాడు. ఇటీవలే ఇల్లు పూర్తవ్వడంతో తన కొత్త ఇల్లు అని హోమ్ టూర్ చేశాడు. ఆ హోమ్ టూర్ వీడియోని యూట్యూబ్ లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం అది ట్రెండింగ్ లిస్ట్ లో కూడా ఉంది.

Nagarjuna : ‘బంగార్రాజు’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

ఈ హోమ్ టూర్ లో తన డ్యాన్స్ పార్ట్నర్ శ్వేతా నాయుడు కూడా పాల్గొంది. శ్వేతా నాయుడుతో కలిసి తన కొత్త ఇంటిని మొత్తం చూపించాడు. ఇందులో తన పేరెంట్స్, ఫ్యామిలీని కూడా చూపించాడు. లాస్ట్ లో కొత్త ఇంట్లోకి వచ్చినందుకు కేక్ కటింగ్ కూడా చేశారు. తాను కస్టపడి సంపాదించి ఇల్లు కట్టుకున్నానని, ఇల్లు కట్టడానికి చాలా సమయం పట్టింది అని, ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉన్నాను అని తెలిపాడు మెహబూబ్.