Bhavya Bishnoi : IAS ఆఫీసర్ తో నిశ్చితార్థం చేసుకున్న మెహ్రీన్ మాజీ బాయ్‌ఫ్రెండ్..

గతంలో 2021లో పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ హర్యానాకు చెందిన రాజకీయ నాయకుడు భవ్య బిష్ణోయ్(Bhavya Bishnoi) తో నిశ్చితార్థం(Engagement)చేసుకుంది మెహ్రీన్. అప్పట్లో వీరి నిశ్చితార్థం ఫోటోలు, మెహ్రీన్ కి బిష్ణోయ్ ప్రపోజ్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.

Bhavya Bishnoi : IAS ఆఫీసర్ తో నిశ్చితార్థం చేసుకున్న మెహ్రీన్ మాజీ బాయ్‌ఫ్రెండ్..

Mehreen Ex Boy Friend Bhavya Bishnoi Engaged with another women

Bhavya Bishnoi :  సినీపరిశ్రమలోకి తెలుగులో కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది మెహరీన్ కౌర్ పిర్జాదా(Mehreen Kaur Pirzada). అనంతరం తెలుగు, తమిళ్, హిందీ, పంజాబీ సినిమాలలో అలరించింది. ఎక్కువగా తెలుగులోనే పలు సినిమాలు చేసి మెప్పించింది మెహ్రీన్. గతంలో 2021లో పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ హర్యానాకు చెందిన రాజకీయ నాయకుడు భవ్య బిష్ణోయ్ (Bhavya Bishnoi) తో నిశ్చితార్థం (Engagement)చేసుకుంది. అప్పట్లో వీరి నిశ్చితార్థం ఫోటోలు, మెహ్రీన్ కి బిష్ణోయ్ ప్రపోజ్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.

కానీ వీరి నిశ్చితార్థం జరిగిన కొన్ని రోజులకే తమ పెళ్లి క్యాన్సిల్ అయినట్టు ప్రకటించారు. వీరి మధ్య ఏవో గొడవలు వచ్చి, ఇద్దరికీ సెట్ అవ్వదని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్టు సమాచారం. ఇక ఈ నిశ్చితార్థం తర్వాత మెహ్రీన్ ఒక్క F3 సినిమాతోనే ప్రేక్షకులని పలకరించింది. ప్రస్తుతం మెహ్రీన్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా ఫొటోషూట్స్ పోస్ట్ చేస్తుంది. ఇక భవ్య బిష్ణోయ్ హర్యానాలో బైపోల్ ఎలక్షన్స్ లో బీజేపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.

Arjit Singh : పాపం.. బాలీవుడ్ సింగర్ ని గాయపరిచిన మహిళా అభిమాని..

తాజాగా భవ్య బిష్ణోయ్ ఓ IAS ఆఫీసర్ ని నిశ్చితార్థం చేసుకున్నారు. హర్యానాకు చెందిన IAS ఆఫీసర్ పరి బిష్ణోయ్ తో మెహ్రీన్ మాజీ బాయ్‌ఫ్రెండ్, ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. దీంతో వీరి నిశ్చితార్థం ఫోటోలు వైరల్ గా మారాయి. వీరు కూడా స్పెషల్ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ చేయించుకున్నారు. భవ్య బిష్ణోయ్ ఆ ఫోటోలని స్వయంగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో హర్యానాకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, కార్యకర్తలు భవ్య బిష్ణోయ్ కి కంగ్రాట్స్ చెప్తున్నారు. త్వరలోనే వీరి పెళ్లి ఘనంగా జరగనుంది. మరి వీరి నిశ్చితార్థంపై మెహ్రీన్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.