Mohan Babu : ‘మా’లో రాజకీయాలు ఎక్కువ అయిపోయాయి.. అతని వల్లే విష్ణు గెలిచాడు : మోహన్ బాబు

మంచు మోహన్ బాబు మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఎవరు ఎవర్ని రెచ్చగొట్టొద్దని, 'మా'లో రాజకీయాలు ఎక్కువ అయ్యాయి అని పలు వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు సినిమా వాళ్ళ

Mohan Babu : ‘మా’లో రాజకీయాలు ఎక్కువ అయిపోయాయి.. అతని వల్లే విష్ణు గెలిచాడు : మోహన్ బాబు

Mohan Babu

Mohan Babu :  మొత్తానికి ‘మా’ ఎలక్షన్స్ అయిపోయి కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం చేసింది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కొత్తగా గెలిచిన సభ్యులతో పాటు మరి కొంతమంది సినీ ప్రముఖులు వచ్చారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. ప్రమాణ స్వీకారం అనంతరం విచ్చేసిన ప్రముఖులు మీడియాతో మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో మంచు మోహన్ బాబు మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఎవరు ఎవర్ని రెచ్చగొట్టొద్దని, ‘మా’లో రాజకీయాలు ఎక్కువ అయ్యాయి అని పలు వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు సినిమా వాళ్ళకి ఇచ్చిన చిత్రపురి కాలనీని హెరిటేజ్ సైట్ కింద మార్చేసి, చుట్టూ ఉన్న కొండలను ఏదో చేద్దామని ఓ ముఖ్యమంత్రి ప్లాన్ చేశారు. శ్రీనివాస్ యాదవ్‌కు కూడా ఈ విషయం తెలుసు. నేను అప్పుడు రాజ్యసభ సభ్యుడిని. అప్పట్లో నేను గవర్నర్ వద్దకు వెళ్లి దీనిపై వినతి పత్రం కూడా సమర్పించా అని మోహన్ బాబు అన్నారు.

Sherlyn Chopra : రాజ్ కుంద్రా, శిల్పా శెట్టిలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన హీరోయిన్

కళాకారులకు అన్యాయం జరగవద్దని నేను చెప్తాను. నేను ఏం చేశానో ప్రకృతికి, ఆ దేవుడికి తెలుసు. ఆ భగవంతుడు ఉన్నాడు. మమ్మల్ని ఆశీర్వదించాడు. కలిసి మెలసి ఉంటూ కావల్సినవి సాధించుకుందాం. ‘మా’ అనేది రాజకీయ వేదిక కాదు. కళాకారుల వేదిక అని తెలిపారు. సినీ పరిశ్రమలో రాజకీయాలు ఎక్కువైపోయాయి. సినీ పరిశ్రమలో గెలుపు ఓటుములు సహజం. మాలో మేమంతా ఒకే తల్లి బిడ్డలం కానీ ఇటీవల కళామతల్లి బిడ్డల్లో ఐక్యం లోపించింది అని మోహన్ బాబు వ్యాఖ్యానించారు.

ఇక నరేష్ గురించి మాట్లాడుతూ.. ‘మా’ ఎన్నికల్లో నా బిడ్డ విష్ణుకు నరేశ్ సాయం చేశారు. అది మామూలు సాయం కాదు. నా బిడ్డ గెలుపు కోసం చాలా కృషి చేశారు. విష్ణుకి ఎన్నో సలహాలు ఇచ్చారు. నరేశ్ నా స్నేహితుడు కాదు. నరేశ్ తో ఎన్నడూ సన్నిహితంగా లేను. అయినప్పటికీ ఆయన వచ్చి నా బిడ్డకు సాయం చేశారు అని మోహన్ బాబు నరేష్ కి కృతజ్ఞతలు తెలిపారు.