Bro Daddy : ట్రైలర్ అదిరింది.. ఓటీటీలో మోహన్ లాల్ మూవీ..

‘లూసీఫర్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మలయాళీ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో ‘బ్రో డాడీ’ సినిమా చేస్తున్నారు మోహన్ లాల్..

Bro Daddy : ట్రైలర్ అదిరింది.. ఓటీటీలో మోహన్ లాల్ మూవీ..

Bro Daddy

Bro Daddy: ప్రస్తుత పరిస్థితుల్లో సీనియర్ హీరోలు, స్టార్ హీరోలు తమ సినిమాలను ఓటీటీల్లో విడుదల చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇటీవల ‘దృశ్యం 2’ తో ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన
ది కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తన తర్వాతి సినిమాను కూడా ఓటీటీలోనే రిలీజ్ చెయ్యబోతున్నారు..

RajiniKanth : ఐశ్వర్య-ధనుష్ విడాకులు.. రజినీ ధైర్యంగా ఉండాలంటూ ఫ్యాన్స్ పోస్టులు

ఆరు పదులు వయసు దాటినా ఇప్పటికీ యంగ్ హీరోలకు, తన తోటి స్టార్లకు గట్టిపోటీనిస్తూ, ఇండస్ట్రీ వర్గాల వారిని ఆశ్చర్యానికి గురి చేస్తూ వరుసగా డిఫరెంట్ స్టోరీస్, ఛాలెంజింగ్ క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకుంటూ దూసుకుపోతున్నారు మోహన్ లాల్.

Sreeja : భర్త పేరు తీసేసిన చిరంజీవి కూతురు.. సమంతని ఫాలో అవుతుందా??

తనకు ‘లూసీఫర్’ వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన పాపులర్ మలయాళీ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో ‘బ్రో డాడీ’ అనే సినిమా చేస్తున్నారు మోహన్ లాల్. పృథ్వీరాజ్, మోహన్ లాల్ కొడుకుగా కనిపించనున్నారు. మీనా, కళ్యాణి ప్రియదర్శన్, కనిక (నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ ఫేమ్), ఉన్ని ముకుందన్ (జనతా గ్యారేజ్ ఫేమ్) కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

Etharkkum Thunindhavan : సూర్య సినిమా పాన్ ఇండియా రిలీజ్!

సినిమా పోస్టర్లు, ప్రోమోలు, పాటలకు మంచి స్పందన వచ్చింది. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26 నుండి డిస్నీ+హాట్ స్టార్‌లో ‘బ్రో డాడీ’ స్ట్రీమింగ్ కానుంది. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ మీద ఆంటోని పెరువంబూర్ నిర్మిస్తున్నారు.