Mohanal : ‘మాన్‌స్టర్’ గా మోహన్ లాల్.. లుక్ అదిరిందిగా..

మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘పులిమురుగన్’ దర్శకుడితో మోహన్ లాల్ చేస్తున్న మరో సినిమా ‘మాన్‌స్టర్’..

Mohanal : ‘మాన్‌స్టర్’ గా మోహన్ లాల్.. లుక్ అదిరిందిగా..

Monster

Mohanal: కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ఈ వయసులోనూ వరుస సినిమాలు లైనప్ చేస్తున్నారు. కొత్త స్టోరీస్, డిఫరెంట్ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటూ తనకు తానే సాటి అంటూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో దాదాపు 10 సినిమాల వరకూ ఉన్నాయి.

Anasuya Bharadwaj : పొగరున్న దాక్షాయణిగా షాకింగ్ లుక్‌లో అనసూయ!

కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంటే, మరికొన్ని షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇప్పుడు మరో కొత్త సినిమాతో సర్‌ప్రైజ్ చేశారు. మోహన్ లాన్ కెరీర్‌లో, అలాగే మలయాళ ఇండస్ట్రీలో 100 కోట్లు వసూలు చేసిన ఫస్ట్ మూవీగా హిస్టరీ క్రియేట్ చేసింది ‘పులిమురుగన్’. తెలుగులో ‘మన్యంపులి’ పేరుతో విడుదలై ఇక్కడ కూడా సెన్సేషనల్ హిట్ అయ్యింది.

Adipurush : పక్కా పాన్లింగ్.. అనుకున్న టైంకే ‘ఆదిపురుష్’

ఈ సినిమా రైటర్ ఉదయ్ కృష్ణ, డైరెక్టర్ వైశాఖ్‌తో మోహన్ లాల్ మరో చిత్రం చేస్తున్నారు. ‘మాన్‌స్టర్’ అనే సాలిడ్ టైటిల్ ఫిక్స్ చేస్తూ.. ఆయన చేస్తున్న ‘లక్కీ సింగ్’ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. లుక్ అదిరిపోయింది. ఈరోజు నుండి షూటింగ్ స్టార్ట్ కానుంది. మోహన్ లాల్‌తో వరుసగా సినిమాలు నిర్మిస్తున్న ఆశీర్వాద్ సినిమాస్ అధినేత ఆంటోని పెరుంబవూర్ ‘మాన్‌స్టర్’ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు.