Liger: మరింత ఆలస్యంగా రానున్న రౌడీ హీరో.. కారణం ఏంటంటే?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరింత ఆలస్యంగా రానున్నాడు. విజయ్ ప్రస్తుతం తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి..

Liger: మరింత ఆలస్యంగా రానున్న రౌడీ హీరో.. కారణం ఏంటంటే?

Liger Mike Tyson

Liger: రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరింత ఆలస్యంగా రానున్నాడు. విజయ్ ప్రస్తుతం తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ తో కలిసి తొలిసారి పాన్ ఇండియా సినిమాగా లైగర్ రూపొందుతుంది. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కూడా నటించనున్న ఈ సినిమాను బాలీవుడ్ క్రేజీ నిర్మాత కరణ్ జోహార్ తో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ నిర్మిస్తుంది. ఛార్మి కూడా ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకోవడం విశేషం కాగా ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి.

Big Boss 5: శ్రీరామచంద్ర.. హమీదా అర్ధరాత్రి ముద్దులు.. షో శృతి మించుతోందా?

ఒకవిధంగా చెప్పాలంటే రౌడీ హీరో అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పైగా పూరి మార్క్ సినిమా చూడాలని తపన పడే అభిమానులు కూడా మరోవైపు. అయితే.. అభిమానుల ఎదురుచూపులు నిజమే అయినా సినిమా మాత్రం మరింత ఆలస్యమవుతూ వస్తుంది. లైగర్ కన్నా ముందే మొదలైన సినిమాలు విడుదలకు డేట్స్ ప్రకటించినా విజయ్-పూరి మాత్రం ఇంకా షూటింగ్ కూడా పూర్తిచేయలేదు.

Prabhas: పాన్ వరల్డ్ స్థాయికి రెబల్ స్టార్.. తొమ్మిది భాషల్లో స్పిరిట్?

నిజానికి పూరి సినిమా అంటే జెట్ స్పీడ్ లో వచ్చేస్తుంది. షూటింగ్ ఎప్పుడు మొదలైందో కూడా తెలియకుండానే వచ్చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ అలాంటి పూరికి ఈసారి ఆలస్యం తప్పలేదు. ఈ సినిమాకి సంబంధించి యూఎస్ షెడ్యూల్ ఇంకా పూర్తి కాలేదు. రెండు వారాల పాటు కొనసాగే ఈ కీలకమైన షెడ్యూల్లో మైక్ టైసన్ కూడా పాల్గొనబోతున్నారు. ఇక ఈ షెడ్యూల్ కు సంబంధించిన వీసా ప్రాసెస్ ఇంకా పూర్తి కాకపోగా త్వరలోనే ఈ షెడ్యూల్ ప్లాన్ చేయనున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయితే తప్ప రిలీజ్ డేట్ మీద క్లారిటీ వచ్చే అవకాశం లేదు.