Moto G13 Smartphone : మోటోరోలా నుంచి కొత్త బడ్జెట్ ఫోన్ వస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!

Moto G13 Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా (Motorola) నుంచి కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. వచ్చే ఏడాది 2023లో Moto G13 బడ్జెట్ ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ ఫోన్ సంబంధించి అనేక లీకులు బయటకు వచ్చాయి.

Moto G13 Smartphone : మోటోరోలా నుంచి కొత్త బడ్జెట్ ఫోన్ వస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!

Motorola could soon announce Moto G13 in India

Moto G13 Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా (Motorola) నుంచి కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. వచ్చే ఏడాది 2023లో Moto G13 బడ్జెట్ ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ ఫోన్ సంబంధించి అనేక లీకులు బయటకు వచ్చాయి. ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్‌సైట్‌లో మోటో G13 వివరాలు కనిపించాయి. మోటరోలా ఈ బడ్జెట్ ఫోన్‌ను భారతీయ మార్కెట్లో లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఇప్పటివరకు, Moto G13 ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (FCC) సర్టిఫికేషన్ డేటాబేస్ అలాగే NBTC సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌ను పొందింది. రాబోయే Moto G13 స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలను వెల్లడించలేదు. FCC లిస్టులో ఈ హ్యాండ్‌సెట్ సాధారణ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని చెప్పవచ్చు. 20W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుందని తేలింది. మార్కెట్‌లోని చాలా డివైజ్ మాదిరిగానే ఈ ఫోన్‌లో పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్‌ ఉంటుందని లీక్ డేటా రెండర్‌లు వెల్లడించాయి.

Motorola could soon announce Moto G13 in India

Motorola could soon announce Moto G13 in India

Read Also :  Traveling Across Europe : యూరప్ వెళ్తున్నారా? ఇకపై విమానాల్లోనూ 5G ఇంటర్నెట్ ద్వారా ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు..!

లీక్‌ల ప్రకారం.. వెనుకవైపు, Moto G13లో డ్యూయల్ కెమెరా సెటప్‌ ఉండే అవకాశం ఉంది. బడ్జెట్ AMOLED ప్యానెల్‌తో వస్తుందని చెప్పవచ్చు. అలాగే తక్కువ ధర కలిగిన Moto G42 స్మార్ట్‌ఫోన్‌తో కూడా రావొచ్చు. 90Hz డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చు. హుడ్ కింద, MediaTek Helio G99 ప్రాసెసర్ ఉండవచ్చు. Qualcomm Snapdragon 732G చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. వాటిలో ఏదీ 5G చిప్ కాదు.. అంటే Moto G13 5G డివైజ్ కావచ్చు. సరికొత్త ఆండ్రాయిడ్ 13OS అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో రానుందని భావిస్తున్నారు.

Motorola could soon announce Moto G13 in India

Motorola could soon announce Moto G13 in India

మోటో G13 స్పెసిఫికేషన్స్ పరంగా.. రాబోయే మోటరోలా ఫోన్ భారత మార్కెట్లో రూ. 15వేల లోపు ధర ఉండవచ్చు. బేస్ వేరియంట్ 64GB స్టోరేజీగా ఉండవచ్చు. ప్రస్తుతానికి, Moto G13 లాంచ్ గురించి ఎలాటి వివరాలు వెల్లడి కాలేదు. Moto G13ని ఈ ఏడాదిలో క్యూ1 2023లో ప్రకటిస్తారని చెప్పవచ్చు. Moto G13 ఈ ఏడాదిలో ప్రారంభమయ్యే అవకాశం లేదు. వచ్చే ఏడాది జనవరిలో ఈ బడ్జెట్ ఫోన్‌ను లాంచ్ చేయవచ్చని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Best in 2022 Smartphones : 2022లో రిలీజ్ అయిన 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్ కొనేసుకోండి..!