Telugu New Films: ముందుంది సినిమా పండగ.. థియేటర్లు రచ్చ రచ్చే!

అఖండ ట్రైలర్ తో అదరగొట్టేస్తున్నారు బాలయ్య. హై యాక్షన్ సీన్స్ తో బోయపాటి మరోసారి అద్భుతం సృష్టించారని ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా..

Telugu New Films: అఖండ ట్రైలర్ తో అదరగొట్టేస్తున్నారు బాలయ్య. హై యాక్షన్ సీన్స్ తో బోయపాటి మరోసారి అద్భుతం సృష్టించారని ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా రాబోతున్న అఖండపై ట్రైలర్ తో ఫుల్ ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసారు. కొవిడ్ తర్వాత థియేటర్స్ కొస్తున్న పెద్ద హీరో బాలయ్యనే. ఇక డిసెంబర్ 2న అఖండ థియేటర్స్ కొస్తుంటే.. ఆ డేట్ నుంచి తప్పుకున్న గని కూడా కొత్త టీజర్ తో ఆకట్టుకుంటోంది. డిసెంబర్ 24కు షిఫ్ట్ అయ్యి.. శ్యామ్ సింగ రాయ్ కి సవాలు విసురుతున్న వరుణ్ తేజ్ తన గని సినిమాపై బాగానే హోప్స్ పెట్టుకున్నాడు.

Liger: ‘లైగర్‌’ టీం స్పెషల్ ట్రీట్.. మైక్ టైసన్‌కు భారతీయ వంటకాలు!

కాస్త డిఫరెంట్ టచ్ తో సింగిల్స్ బరిలో దూకాడు ప్రభాస్. అందరూ మాస్ బీట్స్ తో ఫాస్ట్ ట్రీట్ ఇస్తుంటే.. డార్లింగ్ మాత్రం క్లాసిక్ టోన్ వినిపించాడు. తెలుగు, హిందీ భాషల్లో ముందు రిలీజైన రాధేశ్యామ్ ఫస్ట్ సింగిల్…తమిళ్, కన్నడ, మలయాళం లాంగ్వేజెస్ లో రిసెంట్ గా రిలీజై ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. ఇక సంక్రాంతికి పెద్ద గ్యాప్ కూడా లేదు కాబట్టి పాన్ ఇండియా స్టార్ సినిమా నుంచి రెగ్యులర్ అప్ డేట్స్ ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.

Telugu New Films: డిసెంబర్ రావడమే ఆలస్యం టాలీవుడ్ జాతర షురూ!

హీరోలందరూ థియేటర్స్ బాట పడుతుంటే.. నా రూట్ సపరేట్ అంటున్నారు వెంకటేశ్. దృశ్యం 2 సినిమాను ప్రైమ్ ఓటీటీకి ఈ నెల 25న తీసుకు రాబోతున్నారు. స్ట్రీమింగ్ కి పెద్దగా టైమ్ లేకపోవడంతో ప్రమోషన్స్ గట్టిగా చేస్తున్నారు. మొన్న టీజర్ తో రిలీజ్ డేట్ ప్రకటించిన దృశ్యం 2 టీమ్.. రీసెంట్గా సింపుల్ ఈవెంట్ తో ట్రైలర్ ను ఆడియెన్స్ ముందుకు వదిలింది.

Telugu Films: టాలీవుడ్ బాట పట్టిన ఇంటర్నేషనల్ స్టార్స్!

నెల గ్యాప్ లేకుండానే రెండు సినిమాలతో ట్రీట్ ఇవ్వబోతున్నారు రామ్ చరణ్. ట్రిపుల్ ఆర్ జనవరి 7న రిలీజ్ కాబోతుంటే… ఆచార్య ఫిబ్రవరి 2న టైమ్ ఫిక్స్ చేసుకుంది. ఓవైపు శంకర్ సినిమా షూటింగ్ చేసేస్తున్నాడు. మరోవైపు గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఇక కొడుకుకు ఏమాత్రం తగ్గకుండా… ఇంకా చెప్పాలంటే ఎక్కువగానే దూకరడు చూపిస్తున్నారు మెగాస్టార్. ఆచార్య షూటింగ్ కానిచ్చేసి గాడ్ ఫాదర్ ను పరుగులెట్టిస్తున్నారు. గాడ్ ఫాదర్ సెట్స్ పై ఉండగానే… భోళా శంకర్ మూవీతో పాటూ బాబీ సినిమాను కూడా స్టార్ట్ చేసేసారు.

Pushpa: రిలీజ్‌కు ముందే ప్రమోషన్లతో పిచ్చెక్కించేస్తున్న పుష్పరాజ్!

పవన్ కల్యాణ్ కూడా స్పీడ్ పెంచారు. సంక్రాంతి రేస్ నుంచి భీమ్లా నాయక్ వెనక్కి తగ్గేదే లే అంటున్నారు. భీమ్లా నాయక్ లాస్ట్ షెడ్యూల్ పూర్తి చేసి.. హరిహర వీరమల్లు కోసం మళ్లీ కత్తి తిప్పబోతున్నారు. ఆ తర్వాత హరీశ్ శంకర్ సినిమాను లైన్ లో పెట్టారు. వచ్చే రోజులు మాత్రం పవన్ ఫిల్మ్ అప్ డేట్స్ తో ఫ్యాన్స్ కు పూనకాలు రావడం ఖాయంలా కనిపిస్తోంది.

Sankranthi 2022: సంక్రాంతి సినిమా ఫైట్.. టాలీవుడ్ పెద్దల మంతనాలు?

నాగ్ ఫ్యామిలీ కూడా తక్కువ హైప్ క్రియేట్ చేయట్లేదు. బంగార్రాజును ఎలాగైనా సంక్రాంతి రేస్ లో ఉంచాలనుకుంటున్న నాగ్… భీమ్లా నాయక్ తప్పుకుంటే ఖచ్చితంగా సంక్రాంతికి వచ్చేస్తారు. లేదంటే జనవరి 26ను చూసుకుంటారు. ఈ సినిమాలో నాగచైతన్య కూడా ఉంటాడు కాబట్టి అక్కినేని అభిమానులకు పండగే. మరోవైపు నాగ్ ఘోస్ట్ సినిమా షూటింగ్ దశలో ఉంది. నాగచైతన్య థ్యాంక్యూ, అఖిల్ ఏజెంట్ లాంటి సినిమాలన్నీ.. నెక్ట్స్ ఇయర్ కొత్త కొత్త అప్ డేట్స్ తో సందడి చేయబోతున్నాయి.

Anubhavinchu Raja: ప్రామిసింగ్ ట్రైలర్‌తో పాజిటివ్ వైబ్స్ తెచ్చిన రాజ్ తరుణ్!

ప్రభాస్ ప్యాన్ ఇండియా ఫిల్మ్స్ ఉండనే ఉన్నాయి. మహేశ్ బాబు సర్కారు వారి పాట తర్వాత త్రివిక్రమ్, రాజమౌళిలను లైన్ లో పెట్టారు. లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ సుకుమార్ కాంబో సెట్స్ పైకెళ్లే ఛాన్స్ ఉంగి. పుష్ప పార్ట్ 1తో ప్రస్తుతం హాట్ ట్రెండ్ క్రియేట్ చేస్తున్న బన్నీ.. బోయపాటితో కొత్త ప్రాజెక్ట్ షురూ చేయనున్నాడు. ఇక పుష్ప పార్ట్ 2 షూటింగ్ కూడా ఉంటుంది. శ్యామ్ సింగ రాయ్ ను నెక్స్ట్ మంత్ చూపిస్తోన్న నాని… జనవరిలో దసరా రెగ్యులర్ షూటింగ్ మొదలెడతాడు. బాలకృష్ణ వంటి సీనియర్స్ స్టార్స్ దగ్గరి నుంచి వరుణ్ తేజ్, నాగశౌర్య లాంటి యంగ్ టాలెంట్స్ వరకు రాబోయే రోజుల్లో అందరూ హల్చల్ చేసేవారే.

ట్రెండింగ్ వార్తలు