Prabhas : ప్రాజెక్ట్ K సెట్‌లో RRR…

రఘురామ కృష్ణరాజు ఈ ట్వీట్స్ లో.. ''అమితాబ్, ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్టు K సినిమా షూటింగ్ సెట్ కి వచ్చాను. నాగ్ అశ్విన్ ఈ సినిమా నిర్మిస్తుండగా, నా ఫ్రెండ్ నిర్మాత అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. షూటింగ్ స్పాట్లో అదిరిపోయే...............

Prabhas : ప్రాజెక్ట్ K సెట్‌లో RRR…

Project K

RRR :  ప్రభాస్ హీరోగా, దీపికా పదుకొనె హీరోయిన్ గా, అమితాబ్, దిశా పటాని ముఖ్యపాత్రల్లో మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ K తెరకెక్కుతుంది. ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ అయిపోగా ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది.

ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ సెట్ లో ప్రాజెక్టు k సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో దాదాపు అందరు ఫేమస్ ఆర్టిస్టులు ఉన్నారు. తాజాగా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు(RRR) ప్రభాస్ ప్రాజెక్ట్ K సెట్‌లోకి అడుగు పెట్టారు. తన ఫ్రెండ్ నిర్మాత అశ్వనీదత్ నిర్మిస్తోన్న మూవీ షూటింగ్ సెట్‌కు వచ్చాను అంటూ ట్వీట్ చేశారు రఘురామ కృష్ణరాజు.

Heroins : పెళ్ళైనా సినిమాలు చేస్తాం.. పెళ్లి తర్వాత కూడా బిజీగా ఉన్నా హీరోయిన్స్..

రఘురామ కృష్ణరాజు ఈ ట్వీట్స్ లో.. ”అమితాబ్, ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్టు K సినిమా షూటింగ్ సెట్ కి వచ్చాను. నాగ్ అశ్విన్ ఈ సినిమా నిర్మిస్తుండగా, నా ఫ్రెండ్ నిర్మాత అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. షూటింగ్ స్పాట్లో అదిరిపోయే సెట్లు వేశారు. ఎక్కడెక్కడి నుంచో చాలా మంది నటీనటులు వచ్చారు. చూసేందుకు రెండు కళ్లు చాలలేదు. ఈ సినిమా ఇండియాలోని ప్రతీ ఒక్క సినిమా లవర్‌ను గర్వపడేలా చేస్తుంది. అమితాబ్ గారితో అద్భుతమైన సమయాన్ని గడిపాను. ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించి, తిరుగులేని స్టార్డంతో ఉన్నా కూడా ఆయన ఎంతో హుందాగా, ఏ మాత్రం గర్వం లేకుండా ఉన్నారు. అలాంటి గొప్ప మనిషి నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. ఈ సినిమా ఎంతో పెద్ద సక్సెస్ సాధించాలి. టీం అందరికి, వైజయంతి ఫిలిమ్స్ కి ఆల్ ది బెస్ట్” అని పోస్ట్ చేశారు.