Mrunal Thakur : చెల్లెలు పాత్రలో సీతారామం హీరోయిన్.. వద్దన్నా ఎందుకు చేస్తుందో చెప్పింది..

పిప్పా సినిమాలో ఇషాన్ ఖట్టర్ హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోకి చెల్లెలి పాత్రలో నటిస్తుంది. దీంతో చాలా మంది ఆమెని చెల్లెలి పాత్ర చేయొద్దు అని చెప్పారంట. చెల్లెలి పాత్రలో చేస్తే..................

Mrunal Thakur : చెల్లెలు పాత్రలో సీతారామం హీరోయిన్.. వద్దన్నా ఎందుకు చేస్తుందో చెప్పింది..

Mrunal Thakur comments on her next movie

Mrunal Thakur :  బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ ఇటీవల వచ్చిన సీతారామం సినిమాతో దేశవ్యాప్తంగా ఫేమ్ తెచ్చుకొని భారీగా అభిమానులని సంపాదించుకుంది. ఈ సినిమాలో సీత క్యారెక్టర్ తో అందర్నీ మెప్పించింది. త్వరలో సీతారామం భామ మృణాల్ బాలీవుడ్ లో పిప్పా అనే సినిమాతో రాబోతుంది. 1971లో ఇండియా పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుంది. బ్రిగేడియర్‌ మోహతా రాసిన ‘ది బర్నింగ్‌ చాఫీస్‌’ అనే పుస్తక ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

పిప్పా సినిమాలో ఇషాన్ ఖట్టర్ హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోకి చెల్లెలి పాత్రలో నటిస్తుంది. దీంతో చాలా మంది ఆమెని చెల్లెలి పాత్ర చేయొద్దు అని చెప్పారంట. చెల్లెలి పాత్రలో చేస్తే హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతాయి అని చెప్పారట. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ దీనిపై స్పందించింది.

Yogi Babu : స్టార్ కమెడియన్ పై నిర్మాతల మండలిలో ఫిర్యాదు..

మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. ”నాకు చాలా మంది చెప్పారు చెల్లెలి పాత్రలో నటిస్తే తర్వాత ఆఫర్స్ రావని. ఈ పాత్ర చేయొద్దు అన్నారు. కానీ అది వట్టి అపోహ మాత్రమే. మనమేంటో నిరూపించుకోవాలంటే అన్ని రకాల పాత్రలని చేయాలి, ఏ పాత్రలోనైనా ప్రేక్షకులని మెప్పించగలగాలి. కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకుంటే అంత మంచి పాత్రని మిస్ అయిపోయాం అనే బాధ ఉండకూడదు. పిప్పా సినిమాలో నా పాత్ర అలాంటిదే. చెల్లెలి పాత్ర చాలా మంది హృదయాలకి తాకుతుంది” అని చెప్పింది. సౌత్ లో కూడా ఈ రూల్ బ్రేక్ చేసి కీర్తి సురేష్ స్టార్ హీరోల పక్కన చెల్లిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.