Anant Ambani: ముకేష్ అంబానీ తనయుడి నిశ్చితార్థం… రాధికా మర్చంట్‌ను వివాహమాడనున్న అనంత్ అంబానీ

రాజస్థాన్‌లోని, నాథ్ ద్వారాలో ఉన్న శ్రీనాథ్‌జీ టెంపుల్‌లో వీరి నిశ్చితార్థం జరిగింది. శైల-వీరేన్ మర్చంట్ దంపతుల కుమార్తె రాధికా మర్చంట్. ముకేష్ అంబానీకి ముగ్గురు పిల్లలు కాగా, వారిలో చిన్న వాడు అనంత్ అంబానీ. అనంత్ కంటే ముందు ఈషా-ఆకాష్ అనే కవలలు ఉన్నారు.

Anant Ambani: ముకేష్ అంబానీ తనయుడి నిశ్చితార్థం… రాధికా మర్చంట్‌ను వివాహమాడనున్న అనంత్ అంబానీ

Anant Ambani: రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ-నీతా దంపతుల తనయుడు అనంత్ అంబానీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. రాధికా మర్చంట్‌తో అనంత్ అంబానీ నిశ్చితార్థ వేడుక గురువారం జరిగింది. ఈ విషయాన్ని అంబానీ కుటుంబం అధికారికంగా వెల్లడించింది.

Election Commission: ఎక్కడినుంచైనా ఓటేయొచ్చు.. రిమోట్ ఈవీఎం మెషీన్లు సిద్ధం చేస్తున్న ఎన్నికల సంఘం

రాజస్థాన్‌లోని, నాథ్ ద్వారాలో ఉన్న శ్రీనాథ్‌జీ టెంపుల్‌లో వీరి నిశ్చితార్థం జరిగింది. శైల-వీరేన్ మర్చంట్ దంపతుల కుమార్తె రాధికా మర్చంట్. ముకేష్ అంబానీకి ముగ్గురు పిల్లలు కాగా, వారిలో చిన్న వాడు అనంత్ అంబానీ. అనంత్ కంటే ముందు ఈషా-ఆకాష్ అనే కవలలు ఉన్నారు. ఈషా అంబానీ-ఆనంద్ పిరమాల్ 2018లో పెళ్లి చేసుకున్నారు. ఆకాష్ అంబానీ, 2019లో శ్లోకా మెహతాను పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు చిన్న కొడుకు అనంత్ వివాహం చేసేందుకు అంబానీ సిద్దమయ్యారు. నిశ్చితార్థం సందర్భంగా అనంత్-రాధిక ఎక్కువ సమయం ఆలయంలోనే గడిపి, దేవుడి ఆశీస్సులు తీసుకున్నారని ఆ కుటుంబ సభ్యులు ప్రకటించారు.

కాగా, అనంత్-రాధిక చాలా కాలంగా ఒకరికొకరు పరిచయం. తమ మధ్య ఉన్న స్నేహాన్ని వీరు వివాహ బంధంగా మలచుకోబోతున్నారు. మరికొద్ది నెలల్లోనే వీరి వివాహం జరిగే అవకాశం ఉంది. ఇక ఆనంత్ అంబానీ.. అమెరికాలో విద్యనభ్యసించి, ప్రస్తుతం రిలయన్స్ సంస్థలో బోర్డ్ మెంబర్‌గా కొనసాగుతున్నాడు.