Bollywood : ఒకే సినిమాలో సల్మాన్, షారుఖ్, హృతిక్.. బాలీవుడ్ బిగ్గెస్ట్ కాంబినేషన్ రాబోతోంది!

ప్రస్తుతం షారుఖ్ పఠాన్ గా, సల్మాన్ టైగర్ గా, హృతిక్ కబీర్ గా వారి వారి సినిమాల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాలన్నీ షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే వీళ్ళ ముగ్గురితో ప్రముఖ డైరెక్టర్....

Bollywood : ఒకే సినిమాలో సల్మాన్, షారుఖ్, హృతిక్.. బాలీవుడ్ బిగ్గెస్ట్ కాంబినేషన్ రాబోతోంది!

Bollywood

Bollywood :  ఇటీవల అన్ని సినీ పరిశ్రమలలోను మల్టీస్టారర్ లు వస్తున్నాయి. బాలీవుడ్ లో కూడా ఈ పంథా ఎప్పట్నుంచో సాగుతున్నా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రచారం తర్వాత ఎక్కువైంది. అలాగే స్టార్ హీరోల సినిమాల్లో మరో స్టార్ హీరో గెస్ట్ గా కనిపించడం సాధారణం. బాలీవుడ్ లో కూడా సల్మాన్ , షారుఖ్ లాంటి హీరోల సినిమాల్లో వేరే హీరోలు లేదా వీళ్ళు వేరే హీరో సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ లు ఇస్తూ ఉంటారు. తాజాగా సల్మాన్, షారుఖ్, హృతిక్ లతో కలిసి భారీ సినిమాని ప్లాన్ చేయబోతున్నారు యశ్ రాజ్ ఫిలిమ్స్.

ప్రస్తుతం షారుఖ్ పఠాన్ గా, సల్మాన్ టైగర్ గా, హృతిక్ కబీర్ గా వారి వారి సినిమాల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాలన్నీ షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే వీళ్ళ ముగ్గురితో ప్రముఖ డైరెక్టర్, నిర్మాత ఆదిత్య చోప్రా ఓ భారీ సినిమాని నిర్మించాలి అనుకుంటున్నారు. హాలీవుడ్ మిషన్ ఇంపాజిబుల్ లాంటి సినిమా తరహాలో స్పై మూవీగా తెరకెక్కించాలని చూస్తున్నారు. గతంలో హృతిక్ ‘వార్’ సినిమాతో భారీ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. వార్ 2 సినిమాగా వీళ్ళ ముగ్గురితో సినిమాని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.

NTR 30 : ఎన్టీఆర్ సినిమాలో మొగిలయ్య పాట??

స్పై యూనివర్స్ సినిమాలో షారుఖ్ పఠాన్ గా, సల్మాన్ టైగర్ గా, హృతిక్ కబీర్ గానే కనిపిస్తారని వార్తలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం వీరి చేతిలో ఉన్న సినిమాలు అయ్యాక ఈ సినిమా ఉండబోతుంది. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమా వస్తే ఇండియాలోనే మరో భారీ మల్టీస్టారర్ అవ్వనుంది. దీంతో బాలీవుడ్ అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.