Abortions: మగబిడ్డ కోసం 8 అబార్షన్లు.. 1500 స్టెరాయిడ్ ఇంజెక్షన్లు చేయించిన భర్త

మగపిల్లాడి కోసం ఓ భర్త భార్యకు 8సార్లు అబార్షన్ చేయించాడు. బాంకాక్ కు తీసుకెళ్లి 1500 హార్మోనల్‌ స్టెరాయిడ్ ఇంజెక్షన్లు చేయించిన ఘటన వెలుగులోకి..

Abortions: మగబిడ్డ కోసం 8 అబార్షన్లు.. 1500 స్టెరాయిడ్ ఇంజెక్షన్లు చేయించిన భర్త

Mumbai Women

Mumbai Woman Forced to Abort 8 Times,1500 Steroids : ఈ కంప్యూటర్ యుగంలో కూడా అనాగరిక ఆలోచనలు పోగొట్టుకోవటంలేదా చాలా మంది మూర్ఖులు. ఆడపిల్లలు కూడా అంతరిక్షంలోకి వెళుతున్న ఈరోజుల్లో కూడా సమాజంలో ఆడపిల్ల అంటే చిన్నచూపు పోవటంలేదు. పుత్రుడే పున్నామ నరకం నుంచి తప్పిస్తాడనే నమ్మకాలు పోగొట్టుకోవటంలేదు. భార్యగా ఓ ఆడపిల్ల కావాలి. కానీ భార్య అయిన ఆడది ఆడపిల్లను కనకూడదు.ఇదీ కొంతమంది మూర్ఖుల ఆలోచనలు. ఆడపిల్లనుకంటే విడాకులిచ్చేసే భర్తలు. కోడలిని ఇంటి గడప తొక్కనివ్వని సాటి ఆడది అత్త. ఆడపిల్లను కంటే బతికుండగానే నరకం చూపిస్తాడు భర్త. అటువంటి ఓ భర్త మగపిల్లాడి కోసం భార్యకు ఏకంగా 8 సార్లు అబార్షన్లు చేయించిన ఘటన ముంబైలో జరిగింది.

ఇంటిపేరు నిలబెట్టే వారసుడే కావాలన్న ఉన్మాదంతో ఓ భర్త భార్యకు ఎనిమిది సార్లు అబార్షన్‌ చేయించాడు. అన్నిసార్లు అబార్షన్ అయిన ఆమెకు అనారోగ్యంతో ఉన్నా కొడుకును కన్నాలనే ఉన్మాదాన్ని కొనసాగించాడు. అలా భార్యకు కొడుకును కనడం కోసం 1,500 స్టెరాయిడ్ ఇంజెక్షన్లు చేయించాడు. కొడుకు కోసం భర్త పెట్టే నరకాన్ని మౌనంగా భరించి భరించి ఈ నరకాన్ని భరించిన ఇక తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించడంతో ఈ అత్యంత దారుణం వెలుగు వచ్చింది. అంతేమరి భర్త పెట్టే హింసలు భార్య నోరు విప్పితేనే గానీ నాలుగు గోడలు దాటి బయటకు రావు. ఇంటిపరువు కోసం..తన బతుకును బజారుపాలు చేసుకోలేక ఇటువంటి ఎంతోమంది భార్యలు నాలుగు గోడలమధ్యే నరకాన్ని చూస్తున్నారు. సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది. సహనానికి మారు పేరు అయిన మహిళ ఆసహనం కోల్పోతే ఇదిగో ఇటువంటి దారుణాలు బయటపడతాయి. మగపిల్లాడి కోసం భర్త పెట్టే అత్యంత దారుణ హింసలు భరించీ భరించీ సహనం కోల్పోయిన భార్య చెప్పిన మాటలు విన్న పోలీసులే షాక్ అయ్యారు.

ఈ బాధాకరన ఘటన వివరాల్లోకి వెళితే..ముంబైకి చెందిన బాధితురాలి వయస్సు 40 ఏళ్లు. 2007లో ముంబైకే చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగింది. బాధిరాలి భర్త, అత్తగారు లాయర్లు. ఆడపడుచు ఓ డాక్టర్‌. కానీ మంచి మానవత్వంలేకపోతే ఎంత గొప్ప చదువులు చదివితే మాత్రంఏంటి ప్రయోజనం? అదే జరిగింది బాధితురాలి విషయంలో.బాధితురాలి అత్తగారి కుటుంబానికి మగసంతానం అంటే పిచ్చి. తమ ఇంటిపేరు నిలబెట్టే వారుసుడే కావాలి. ఆడపిల్ల అస్సలు వద్దు. అలా పెళ్లైన నాటిన నుంచి బాధితురాలి భర్త ఇదే విషయం గురించి చెప్పేవాడు. మనకు మగపిల్లాడే పుట్టాలి. పుట్టి తీరాలి. కొడుకే ఆస్తికి వారసుడు ఉంటాడని అస్తమాను చెప్పేవాడు. దాంతో ఆమె గర్భం దాల్చినప్పటినుంచి భయం పట్టుకుంది. ఎక్కడ ఆడపిల్ల పుడుతుందో..తనను ఎక్కడ హింసిస్తారోనని..

ఆమె భయపడినట్లుగానే 2009లో మొదటికాన్పులో ఆడపిల్లకు పుట్టింది. అంతే ఆమె గుండెలో దడ మొదలైంది. హింసలు మొదలయ్యాయి. ఇదే క్రమంలో 2011లో మరోసారి గర్భం దాల్చింది. దీంతో భర్త ఆమెను డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లి.. లింగనిర్ధారణ పరీక్షలు చేయించాడు. ఆడపిల్ల అని తేలింది. అంతే ఆమె భయం మళ్లీ మొదలైంది. ఎక్కడ కడుపులో బిడ్డను చంపేస్తారోనని. ఆమె భయపడినదంతా జరిగింది. ఆమె ఏడుస్తున్నా పట్టించుకోకుండా బలవంతంగా అబార్షన్‌ చేయించాడు. ఆ తర్వాత నుంచి ఆమె గర్భం దాల్చితే చాలు హింసలు..ఈటెల్లాంటి మాటలు. ఈసారి మగపిల్లాడిని కనకపోతే చూడు నిన్నేం చేస్తామో అంటూ బెదిరింపులు. అలా ఒకటి రెండూ కాదు ఆమె గర్భం దాల్చటం ఆడపిల్ల అని తేలటం అబార్షన్ చేయింటం జరిగేది.

దీంతో నిద్రాహారాలు లేకుండా అదే బెంగతో ఉండేది. కానీ ఆమె ఆరోగ్యం గురించి వారికి పట్టదు.మగపిల్లాడ్ని కనాలి అంతే. మగపిల్లాడు పుట్టాలంటే ఫలానా మందులు వాడాలి అని ఎవరైనా చెబితే చాలు చదువు కున్న అంతటి విద్యావంతులు కూడా మూర్ఖంగా అదే ఫాలో అయ్యేవారు. ఆమెతో ఆ మందులు వాడించేవాడు. అతను కూడా వాడేవాడు.ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం బాధితురాలి భర్త.. ప్రీ-ఇంప్లాంటేషన్ జన్యు నిర్ధారణ కోసం ఆమెను బ్యాంకాక్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు గర్భధారణకు ముందే పిండం లింగాన్ని పరీక్షించడం కోసం చికిత్స, సర్జరీలు చేశారు. మగపిల్లాడి కోసం ఆమెకు ఏకంగా 1500 హార్మోనల్‌ స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇచ్చారు. ఈ టెస్ట్‌, చికిత్సను భారతదేశంలో నిషేధించడంతో అతడు బ్యాంకాక్‌ తీసుకెళ్లాడు.

ఇక బాధితురాలికి దీని గురించి ఏమాత్రం అవగాహన లేదు. అప్పటికే ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఆ తరువాత అసలు విషయం తెలుసుకున్న మెకు సహనం నశించింది. కొడుకు కోసం తనకు అప్పటికే ఎనిమిది సార్లు అబార్షన్‌ చేయించడమే కాక ఇప్పుడు ఆమె అనుమతి లేకుండా ఇంత భారీ ఎత్తున స్టెరాయిడ్లు ఇవ్వడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. అత్తింటి ఆగడాలను భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వీరి బండారం బైటపడింది. ఏమహిళ నోరు విప్పనంత వరకే ఏ కుటుంబం అయినా పరువైనా..ఆమె నోరు విప్పితే ఎన్నో దారుణాలు బయటపడతాయి ఈ మహిళ పరిస్థితిలాగానే..