Sarkaru Vaari Paata: సర్‌ప్రైజ్ ఇస్తోన్న సర్కారు వారి పాట.. ఏమిటంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ ‘సర్కారు వారి పాట’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్....

Sarkaru Vaari Paata: సర్‌ప్రైజ్ ఇస్తోన్న సర్కారు వారి పాట.. ఏమిటంటే?

Murari Vaa Full Song Sarkaru Vaari Paata To Release Tomorrow

Sarkaru Vaari Paata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ ‘సర్కారు వారి పాట’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కించగా, అందాల భామ కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా వచ్చిన ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాలో మహేష్, కీర్తి మధ్య నడిచే ట్రాక్ కూడా ప్రేక్షకులను అలరించింది.

Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన అమెజాన్ ప్రైమ్ వీడియో

ఈ చిత్రానికి థమన్ అందించిన సంగీతం మేజర్ అసెట్ అని చెప్పాలి. ఈ సినిమాలోని అన్ని పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. అయితే ఈ సినిమా కోసం థమన్ తొలుత ‘‘మురారి వా..’’ అనే ఓ మాస్ సాంగ్‌ను కంపోజ్ చేశాడని.. కొన్ని కారణాల వల్ల అది కాకుండా, ‘‘మ..మ..మహేషా’’ అనే పాటను సినిమాలో ఫిక్స్ చేయాల్సి వచ్చిందని పలు ఇంటర్వ్యూల్లో చెబుతూ వచ్చారు. అయితే సినిమా రిలీజ్ తరువాత ఆ పాటను ఖచ్చితంగా సినిమాలో యాడ్ చేస్తామని సర్కారు వారి పాట చిత్ర టీమ్ తెలిపింది. అన్నట్లుగానే, ఇటీవల ఈ పాటను థియేటర్లలో యాడ్ చేయడంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ చేసుకుంటున్నారు.

Sarkaru Vaari Paata: మహేస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. జూన్ 10 కోసం వెయిట్ చేయండి!

అయితే ఇప్పుడు ఈ పాటను థియేటర్లలో మిస్ అయిన వారందరికీ సర్కారు వారి పాట ఓ సర్‌ప్రైజ్ ఇవ్వబోతుంది. ‘మురారి వా..’ పాటను ప్రతిఒక్కరు ఎంజాయ్ చేయాలని కోరుతూ.. ఈ పాటను జూన్ 7న ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ పాటలో మహేష్, కీర్తిల మధ్య కెమిస్ట్రీ అల్టిమేట్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది. మరి థియేటర్లలో ఈ పాటను మిస్ అయిన ఆడియెన్స్, యూట్యూబ్‌లో ఎలా ఆదరిస్తారో చూడాలి.