Sarkaru Vaari Paata: ‘మురారి వా..’ అంటూ మహేష్‌తో కీర్తి రొమాన్స్ షురూ!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే....

Sarkaru Vaari Paata: ‘మురారి వా..’ అంటూ మహేష్‌తో కీర్తి రొమాన్స్ షురూ!

Murari Vaa Song Attached In Sarkaru Vaari Paata

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కించగా, పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా రావడంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తిని కనబరిచారు. ఇక రిలీజ్ రోజునే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా కోసం అభిమానులు థియేటర్ల వద్ద క్యూ కట్టారు.

Sarkaru Vaari Paata : మహేష్ బాబు సినిమాను చూడకుండా ఎలా ఉండగలను.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్

ఈ సినిమాకు థమన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో తొలుత ఓ మాస్ సాంగ్‌ను ఫిక్స్ చేసి, ఆ తరువాత కొన్ని కారణాల వల్ల ‘మ..మ..మహేశా..’ అనే పాటను ఫిక్స్ చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే సినిమా రిలీజ్ సమయంలో హోల్డ్‌లో పెట్టిన మాస్ సాంగ్‌ను తప్పకుండా రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. కాగా.. తాజాగా ఈ పాటకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ చేసింది చిత్ర యూనిట్. ‘మురారి వా..’ అంటూ సాగే ఈ మాస్ నెంబర్‌ను థియేటర్లలో సినిమాకు అటాచ్ చేసి ప్రదర్శించబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ ఓటీటీలో వచ్చేది అప్పుడేనా..?

ఈ పాటలో మహేష్, కీర్తి సురేష్ మరోసారి తమ కెమిస్ట్రీతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయినట్లుగా చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ద్వారా తెలిపింది. మహేష్ అభిమానులకు ఊపిచ్చే విధంగా ఈ పాట ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమా ఇప్పటికే రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. మరి ‘మురారి వా..’ పాట ప్రేక్షకులను ఏ రేంజ్‌లో అలరిస్తుందో చూడాలి.