Movies Clash : రిలీజ్‌ల విషయంలో స్టార్ హీరోల క్లాష్‌లు.. ఈ ఏడాది కూడా తప్పట్లేదు..

 రిలీజ్ విషయంలో పోటీపడుతున్నారు హీరోలు. ఎట్టి పరిస్తితుల్లో రిలీజ్ డేట్ నుంచి తగ్గేదే లేదంటున్నారు. అందుకే జనవరి నుంచి మొదలై సమ్మర్, ఫెస్టివల్స్, ఇయర్ ఎండ్ ఇలా స్టార్ హీరోల దగ్గరనుంచి అప్ కమింగ్ హీరోల వరకూ సినిమాల రిలీజ్ కి డేట్స్...........

Movies Clash : రిలీజ్‌ల విషయంలో స్టార్ హీరోల క్లాష్‌లు.. ఈ ఏడాది కూడా తప్పట్లేదు..

Must know these Star Heros Movie Clashes in This Year

Movies Clash :  రిలీజ్ విషయంలో పోటీపడుతున్నారు హీరోలు. ఎట్టి పరిస్తితుల్లో రిలీజ్ డేట్ నుంచి తగ్గేదే లేదంటున్నారు. అందుకే జనవరి నుంచి మొదలై సమ్మర్, ఫెస్టివల్స్, ఇయర్ ఎండ్ ఇలా స్టార్ హీరోల దగ్గరనుంచి అప్ కమింగ్ హీరోల వరకూ సినిమాల రిలీజ్ కి డేట్స్ ఫిక్స్ చేసుకున్నారు. రిలీజ్ కి మంచి టైమ్ సీజన్ చూస్కోవడంతో చాలా సినిమాలు రిలీజ్ క్లాష్ ఫేస్ చేస్తున్నాయి. కలిసొచ్చిన సీజన్ అని, అచ్చొచ్చిన నెల అని, ముహూర్తాలు చూసుకుని మరీ డేట్స్ ఫిక్స్ చేసుకుంటున్నారు హీరోలు. సెంటిమెంట్ ని, సీజన్ ని ఫాలో అవుతూ మిగతా హీరోలు కూడా సేమ్ డేట్స్ కి రావడంతో బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ ఫైట్ కి తెరతీస్తున్నారు.

కరోనా కారణంగా వాయిదా పడ్డ సినిమాలన్నీ గత ఏడాది క్లాష్ లు పేస్ చేసి మరీ రిలీజ్ అయ్యాయి. అయినా ఈ క్లాష్ లు ఇంకా ఆగట్లేదు. బాలయ్య, చిరంజీవి మధ్య జరిగిన సంక్రాంతి వార్ ని మర్చిపోకముందే మరో బాక్సాఫీస్ వార్ కోసం రెడీ అవుతున్నారు ఈ ఇద్దరు సీనియర్ హీరోలు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో నువ్వా నేనా అంటూ పోటీపడిన ఈ సీనియర్ హీరోలు మరోసారి స్టార్ వార్ కి రెడీ అవుతున్నారు. మెహర్ రమేష్ తో మెగాస్టార్ చేస్తున్న భోళాశంకర్ ఏప్రిల్ నుంచి దసరా కి షిఫ్ట్ అయ్యిందన్న టాక్ నడుస్తోంది. మరో వైపు బాలయ్య, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాను కూడా దసరా కే రిలీజ్ చేద్దామన్న ప్లాన్ లో ఉన్నారు టీమ్. దాంతో మరోసారి బాలయ్య, చిరంజీవి మధ్య సాలిడ్ స్టార్ వార్ జరగబోతోంది.

ఏప్రిల్ 28న సౌత్ లో గట్టి రిలీజ్ క్లాష్ ఇవ్వబోతున్న సినిమా పొన్నియిన్ సెల్వన్ 2. మణిరత్నం మ్యాజికల్ డైరెక్షన్లో ఐశ్వర్యారాయ్, కార్తి, విక్రమ్, త్రిష, జయం రవి, శోభిత.. లాంటి స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ ఏప్రిల్ 28నే రిలీజ్ అవుతున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్. పార్ట్ 1 సినిమా 500కోట్లకు పైగా కలెక్ట్ చేసి మంచి సక్సెస్ అందుకోవడంతో సెకండ్ పార్ట్ మీద కూడా మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. అదే రోజు అఖిల్ మోస్ట్ అవెయిటింగ్ మూవీ ఏజెంట్ కూడా రిలీజ్ అవుతోంది. డిసెంబర్ 2021 నుంచి ఇంకా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ఈ స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ ఏప్రిల్ 28నే ధియేటర్లోకొచ్చి క్లాష్ ఇస్తుంది.

తమిళ్ లో దాదాపు 18 ఏళ్ల తర్వాత స్టార్ వార్ జరగబోతోంది. తమిళ్ సీనియర్ స్టార్ హీరోలైన కమల్ హాసన్, రజనీకాంత్ మధ్య చాలా కాలం తర్వాత రిలీజ్ క్లాష్ జరుగుతోంది. 2005 లో రజనీకాంత్ చంద్రముఖి, కమల్ హాసన్ చేసిన ముంబై ఎక్స్ ప్రెస్ మూవీస్ ఒకేరోజు పోటీ పడ్డాయి. ఇప్పుడు కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారతీయుడు 2, నెల్సన్ దిలీప్ కుమార్-రజనీకాంత్ కాంబినేషన్లో భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న జైలర్ ఈ రెండూ దీపావళికి రాబోతున్నాయంటూ టాక్ గట్టిగా నడుస్తోంది.

Pushpa 2 Shooting : ఫాస్ట్ ఫాస్ట్‌గా పుష్ప 2 షూటింగ్.. సుకుమార్ భార్య స్పెషల్ పోస్ట్..

ఆగస్ట్ లో కూడా రెండు బిగ్గెస్ట్ మూవీస్ క్లాష్ అవుతున్నాయి. బాలీవుడ్ లో రణబీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కుతున్న యానిమల్ ఆగస్ట్ 11న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. అదే డేట్ లో మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా కూడా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.

ఇయర్ ఎండ్ లో స్టార్ వార్ కి రెడీ అవుతున్న మరో రెండు బాలీవుడ్ సినిమాలు బడేమియా ఛోటేమియా, డంకీ. అక్షయ్ కుమార్ , టైగర్ ష్రాఫ్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న బడేమియా చోటేమియా డిసెంబర్ 22న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. అదే రోజు షారూఖ్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న డంకీ కూడా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. మరి ఈ సంవత్సరం జరిగే ఈ క్లాషెస్ లో ఎవరు విజయం సాధిస్తారో, ఎవరు తప్పుకుంటారో చూడాలి.