Muttiah Muralitharan : ఎట్టకేలకు ముత్తయ్య మురళీధరన్ బయోపిక్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్…

గతంలో తమిళ ఇండస్ట్రీలో మురళీధరన్ బయోపిక్ ని ప్రకటించి విజయ్ సేతుపతిని హీరోగా కూడా ప్రకటించారు. కానీ తమిళులు, శ్రీలంకకు మధ్య ఉన్న గొడవలతో శ్రీలంక క్రికెటర్ బయోపిక్ తీయొద్దని చిత్రయూనిట్ కు వార్నింగ్ ఇచ్చారు.

Muttiah Muralitharan : ఎట్టకేలకు ముత్తయ్య మురళీధరన్ బయోపిక్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్…

Muttiah Muralitharan Biopic announced title as 800

Muttiah Muralitharan :  శ్రీలంక(Srilanka) మాజీ క్రికెటర్(Cricketer) ముత్తయ్య మురళీధరన్(Muttiah Muralitharan) బయోపిక్(Biopic) త్వరలో రానుంది. శ్రీలంక క్రికెటర్ అయినా తన బౌలింగ్(Bowling) తో, క్రికెట్ లో తన రికార్డులతో ప్రపంచమంతటా అభిమానులను సంపాదించుకున్నాడు మురళీధరన్. స్పిన్ దిగ్గజంగా ప్రపంచ క్రికెట్ లో నిలిచాడు. టెస్టుల్లో ఏకంగా 800 వికెట్లు తీసి ఎవరూ అందుకోలేనటువంటి రికార్డుని సెట్ చేశాడు. వన్డేల్లో 500 లకు పైగా వికెట్స్ తీసాడు మురళీధరన్. 2011 వరల్డ్ కప్ అనంతరం క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రపంచ క్రికెట్ బౌలింగ్ లో ఎన్నో రికార్డులని సెట్ చేశాడు మురళీధరన్.

గతంలో తమిళ ఇండస్ట్రీలో మురళీధరన్ బయోపిక్ ని ప్రకటించి విజయ్ సేతుపతిని హీరోగా కూడా ప్రకటించారు. కానీ తమిళులు, శ్రీలంకకు మధ్య ఉన్న గొడవలతో శ్రీలంక క్రికెటర్ బయోపిక్ తీయొద్దని చిత్రయూనిట్ కు వార్నింగ్ ఇచ్చారు. విజయ్ సేతుపతి ఈ సినిమా తీస్తే అతనిపై దాడికి పాల్పడతామని కూడా హెచ్చరించారు. దీంతో మురళీధరన్ బయోపిక్ అనౌన్స్ చేసిన కొన్ని రోజులకే ఆగిపోయింది.

తాజాగా మరోసారి మురళీధరన్ బయోపిక్ బయటకు వచ్చింది. తమిళ డైరెక్టర్ MS శ్రీపతి దర్శకత్వంలో బాలీవుడ్ – ఇంగ్లీష్ నటుడు మధుర్ మిట్టల్ మురళీధరన్ పాత్రలో ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ అనౌన్స్ చేశారు. మురళీధరన్ ఒక్క టెస్ట్ క్రికెట్ లోనే 800 వికెట్లు తీసి సంచలనం సృష్టించడంతో ఈ బయోపిక్ కు 800 అనే టైటిల్ ని పెట్టారు. తాజాగా నేడు మురళీధరన్ 51వ పుట్టిన రోజు కావడంతో ఈ బయోపిక్ 800 నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

Ajaneesh Loknath : కాంతార సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విరుపాక్షకు పనిచేశారని మీకు తెలుసా??

పాన్ ఇండియా సినిమాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. తమిళ్ తో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. శ్రీలంకలో కూడా ఈ సినిమాని తమిళ్ భాషతో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు చిత్రయూనిట్. ప్రస్తుతం 800 సినిమా షూటింగ్ దశలో ఉంది. 2023 చివర్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.