Naga Chaitanya – Samantha : కన్ఫామ్.. విడిపోయిన నాగ చైతన్య – సమంత

సమంతతో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు అక్కినేని నాగ చైతన్య..

Naga Chaitanya – Samantha : కన్ఫామ్.. విడిపోయిన నాగ చైతన్య – సమంత

Sam Chaithanya

Naga Chaitanya – Samantha: అక్కినేని నాగ చైతన్య – సమంత విడిపోయారు. ఇట్స్ అఫీషియల్. భార్యభర్తలుగా విడిపోతున్నామని చైతన్య ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.
పదేళ్లుగా తమ మధ్య స్నేహబంధం కొనసాగిందన్నారు.

తమ మధ్య రిలేషన్‌లో ఈ  స్నేహబంధమే చాలా కీలకం అన్నారు నాగచైతన్య. ఆ ప్రత్యేక బంధం ఇకనుంచి కూడా కొనసాగుతుందని చెప్పారు. ఇటువంటి క్లిష్ట సమయంలో అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియా తమ ప్రైవసీని గౌరవించాలని కోరారు. తాము ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని… ఇందుకు అందరి సహకారం కావాలని ట్వీట్ చేశారు.

చైతన్య – సమంతల మధ్య ఏం జరిగింది?.. విడిపోబోతున్నారా? అంటూ గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.. అలాగే ఆ వార్తలకు మరింత బలం చేకూర్చేలా సమంత ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా అకౌంట్స్‌లో తన పేరు పక్కన ఉన్న అక్కినేని పేరు తీసెయ్యడం.. కొద్ది రోజులు కేవలం స్నేహితులతో మాత్రమే ఔటింగ్, పార్టీలు వంటివి చేసుకోవడంతో అక్కినేని అభిమానులు, ప్రేక్షకులు అయోమయంలో పడ్డారు.. చివరకి చైతు క్లారిటీ ఇవ్వడంతో అందరూ షాక్‌కి గురయ్యారు.