Naga Chaitanya : వెంకీ మామయ్యపై నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.. రానానాయుడు సిరీస్ పై నాగచైతన్య కామెంట్స్..

సినిమా రిలీజ్ కి ముందు రోజు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్య పలు ఆసక్తికర అంశాల గురించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో వెంకటేష్, రానా కలిసి నటించిన రానా నాయుడు సిరీస్ పై కామెంట్స్ చేశారు.

Naga Chaitanya : వెంకీ మామయ్యపై నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.. రానానాయుడు సిరీస్ పై నాగచైతన్య కామెంట్స్..

Naga Chaitanya comments on Rana Naidu Series

Naga Chaitanya :  నాగచైతన్య(Naga Chaitanya), కృతిశెట్టి(Krithi Shetty) జంటగా వెంకట్ ప్రభు(Venkat Prabhu) దర్శకత్వంలో తెరకెక్కిన కస్టడీ(Custody) సినిమా నేడు మే 12న గ్రాండ్ గా రిలీజ్ అయింది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై ముందే అంచనాలు నెలకొన్నాయి. తెలుగు, తమిళ్ లో ఈ సినిమా రిలీజయింది. ఇప్పటికే కస్టడీ సినిమా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు పడ్డాయి. ఇక్కడ కూడా కొన్ని చోట్ల ఎర్లీ మార్నింగ్ షోలు పడ్డాయి. కస్టడీ సినిమా చూసిన ప్రేక్షకులు, అభిమానులు తమ రివ్యూలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారు. చాలా మంది సినిమా బాగుంది అనే చెప్తున్నారు. కొన్ని సీన్స్ తప్ప సినిమా అదరగొట్టింది అంటున్నారు అభిమానులు, ప్రేక్షకులు. అన్ని చోట్లా కస్టడీ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.

ఇక నిన్నటి వరకు కూడా చిత్రయూనిట్, నాగచైతన్య ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. సినిమా రిలీజ్ కి ముందు రోజు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్య పలు ఆసక్తికర అంశాల గురించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో వెంకటేష్, రానా కలిసి నటించిన రానా నాయుడు సిరీస్ పై కామెంట్స్ చేశారు. వెంకటేష్, రానా కలిసి నటించిన రానా నాయుడు సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవ్వగా ఈ సిరీస్ పై తెలుగు రాష్ట్రాల్లో దారుణమైన విమర్శలు వచ్చాయి. అడల్ట్ సిరీస్ అని, అసలు వెంకటేష్ ఇలాంటి సిరీస్ ఎలా చేశాడని నెగిటివ్ కామెంట్స్ చేశారు. కొన్ని రోజులు రానా నాయుడు వార్తల్లో నిలిచింది.

Custody Review : కస్టడీ ట్విట్టర్ రివ్యూ.. చైతూ కెరీర్ లో బెస్ట్ సినిమా అవుతుందట..

నాగచైతన్య రానా నాయుడు సిరీస్ గురించి మాట్లాడుతూ.. వెంకటేష్ గారికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఉంది. అది నిజమే. అందుకే రానా నాయుడు సిరీస్ చూశాక ప్రేక్షకులు షాక్ అయ్యారు. కొంతమంది వెంకీ మామ మీద నెగిటివ్ కామెంట్స్ చేశారు. కానీ నటుడు అన్నాక అన్ని పాత్రలు చేయాలి. అప్పుడే నటుడిగా ఎదుగుదల ఉంటుంది. నటుడిగా అలా చేశారంటే, ఇంట్లో కూడా అలా ఉంటామని కాదు కదా అని అన్నారు. మొత్తానికి చైతూ కూడా వెంకీ మామను వెనుకేసుకొచ్చాడు. ఇక రానా నాయుడు సిరీస్ కి సీజన్ 2 కూడా ఉంటుందని నెట్ ఫ్లిక్స్ గతంలోనే ప్రకటించింది. మరి ఈ సారి ఏ రేంజ్ లో అడల్ట్ చూపిస్తారో.