Custody Movie: కస్టడీ నుండి బిగ్ అప్డేట్ ఇచ్చిన చైతూ.. ఫ్యాన్స్ గెట్ రెడీ!

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’ నుండి తాజాగా ఓ అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను త్వరలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

Custody Movie: కస్టడీ నుండి బిగ్ అప్డేట్ ఇచ్చిన చైతూ.. ఫ్యాన్స్ గెట్ రెడీ!

Naga Chaitanya Custody Movie Big Update

Custody Movie: అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక ఈ సినిమాలో చైతూ ఓ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అక్కినేని ఫ్యాన్స్‌లో అంచనాలు ఏర్పడ్డాయి.

Custody Movie: ‘కస్టడీ’ టీజర్‌కు అదిరిపోయిన రెస్పాన్స్.. ఏకంగా 15 మిలియన్ వ్యూస్!

ఈ సినిమాను వేసవి కానుకగా మే 12న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే ఈ సినిమా నుండి తాజాగా ఓ అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను త్వరలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ సినిమాకు మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమా మ్యూజిక్ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Custody Movie: నాగచైతన్య కస్టడీ టీజర్ వచ్చేది అప్పుడే!

ఈ సినిమాలో అందాల భామ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోండగా, శరత్ కుమార్, అరవింద్ స్వామిలు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరి ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తారా చూడాలి.