Chay-Sam : నా బెస్ట్ ఆన్ స్క్రీన్ పెయిర్ సమంతనే : నాగ చైతన్య

ఇటీవల 'బంగార్రాజు' ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో స‌మంత‌, తాను క‌లిసే తీసుకున్న నిర్ణ‌య‌మ‌ని, త‌ను హ్యాపీగా ఉంద‌ని, నేను కూడా హ్యాపీగా ఉన్నాన‌ని చెప్తూ మొదటి సారి....

Chay-Sam : నా బెస్ట్ ఆన్ స్క్రీన్ పెయిర్ సమంతనే : నాగ చైతన్య

Chay Sam

Chay-Sam :   చై సమంత విడిపోయిన తర్వాత సమంత చాలా సార్లు విడాకుల గురించి ఇండైరెక్ట్ గా స్పందింస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. కానీ నాగ చైతన్య మాత్రం విడాకుల తర్వాత ఒక్కసారి కూడా ఈ విషయంపై మాట్లాడలేదు. వరుస సినిమాలతో తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు చై. సంక్రాంతి కానుకగా నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన ‘బంగార్రాజు’ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చైతన్య సమంత గురించి విడాకుల తర్వాత తొలిసారి మాట్లాడాడు.

ఇటీవల ‘బంగార్రాజు’ ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో స‌మంత‌, తాను క‌లిసే తీసుకున్న నిర్ణ‌య‌మ‌ని, త‌ను హ్యాపీగా ఉంద‌ని, నేను కూడా హ్యాపీగా ఉన్నాన‌ని చెప్తూ మొదటి సారి విడాకుల గురించి స్పందించాడు. తాజాగా మరో ఇంటర్వ్యూలో సమంత గురించి ప్రస్తావించాడు చైతన్య. మీరు న‌టించిన హీరోయిన్స్‌లో బెస్ట్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎవ‌రితో ఉంటుంది? అని ఇంటర్వ్యూలో అడగగా… స‌మంత‌తో బెస్ట్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కుదిరింద‌ని త‌డుముకోకుండా వెంటనే స‌మాధానం చెప్పారు నాగ చైత‌న్య‌.

Chiranjeevi : హ్యాపీ ఎండింగ్.. చిరు, జగన్ భేటీపై నాగార్జున కామెంట్స్

వీరిద్దరూ కలిసి నాలుగు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. వీరు కలిసి నటించిన సినిమాల్లో ఏ మాయ చేసావే, మజిలీ, మనం మంచి విజయాల్ని సాధించాయి. అలాగే సమంత లేడీ ఓరియెంటెడ్ గా వచ్చిన సినిమా ‘ఓ బేబీ’లో అథితి పాత్రలో కూడా నటించాడు. ఇలా వీళ్లిద్దరి మధ్య ఆన్ స్క్రీన్ పెయిర్ బాగుంటుందని తానే తెలిపాడు. ఒకవేళ వీరిద్దరూ విడిపోకుండా ఉంటే నందిని రెడ్డి డైరెక్షన్ లో వీరి కాంబినేషన్ లో మరో సినిమా వచ్చి ఉండేది.