Naga Chaitanya: ఆ డైరెక్టర్ వల్ల టైమ్ వేస్ట్ అంటోన్న చైతూ.. ఎవరో తెలుసా?

అక్కినేని నాగచైతన్య ‘కస్టడీ’ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. గతంలో ఓ డైరెక్టర్ తన టైమ్ వేస్ట్ చేశాడంటూ కొన్ని హాట్ కామెంట్స్ చేశాడు ఈ హీరో.

Naga Chaitanya: ఆ డైరెక్టర్ వల్ల టైమ్ వేస్ట్ అంటోన్న చైతూ.. ఎవరో తెలుసా?

Naga Chaitanya Says That Director Wasted His Time

Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ సందడి చేస్తోంది. వరుస ఇంటర్వ్యూలతో చైతూ బిజీగా ఉన్నాడు. కస్టడీ మూవీ తనకు చాలా స్పెషల్ అని చెబుతున్న చైతూ, ఈ క్రమంలో ఓ డైరెక్టర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఓ డైరెక్టర్ వల్ల తన సమయం వేస్ట్ అయ్యిందంటూ ఆయన కామెంట్ చేశాడు.

Naga Chaitanya : సమంత మంచి అమ్మాయి.. ఆమె సంతోషంగానే ఉండాలి.. నాగచైతన్య కామెంట్స్!

ఇంతకీ చైతూ మాట్లాడింది ఎవరి గురించి అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. నాగచైతన్య గతంలో దర్శకుడు పరశురామ్‌తో ఓ సినిమాను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాను 14 రీల్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్నట్లు అనౌన్స్ కూడా చేశారు. అయితే, ఈ సినిమా కోసం చైతూ పలు దఫాలుగా చర్చలు జరిపాడు. కానీ ఎంతకీ ఈ సినిమా వర్కవుట్ కాకపోవడంతో ఈ మూవీ పట్టాలెక్కకముందే ఆగిపోయింది. దీంతో పరశురామ్ తన సమయం వేస్ట్ చేశాడని.. అతడి గురించి మాట్లాడం కూడా వేస్ట్ అంటూ కామెంట్స్ చేశాడు.

Naga Chaitanya: అలా చేస్తే అభిమానులు చంపేస్తారట.. డైరెక్టర్‌కు చైతూ వార్నింగ్!

ప్రస్తుతం నాగచైతన్య చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇలా ఓ డైరెక్టర్ గురించి చైతూ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. మరి ఈ కామెంట్స్‌పై దర్శకుడు పరశురామ్ ఎలా స్పందిస్తాడనేది చూడాలి. ఇక కస్టడీ మూవీని దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్ట్ చేయగా, అందాల భామ కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.