Thank You: థ్యాంక్యూ రన్‌టైమ్.. మరీ అంతా..?

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘థ్యాంక్యూ’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు విక్రమ్ కుమార్....

Thank You: థ్యాంక్యూ రన్‌టైమ్.. మరీ అంతా..?

Naga Chaitanya Thank You Movie Runtime Locked

Thank You: అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘థ్యాంక్యూ’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు విక్రమ్ కుమార్ ఔట్ అండ్ ఔట్ ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యియి. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు చేశాయి.

Thank You Trailer Launch: థ్యాంక్యూ ట్రైలర్ లాంఛ్‌లో సందడి చేసిన స్టార్స్

ఇక ఈ సినిమాను జూలై 22న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ సినిమాలో నాగచైతన్య పాత్రను చాలా వైవిధ్యంగా డిజైన్ చేసినట్లుగా చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది. కాగా తాజాగా ఈ సినిమా రన్‌టైమ్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. థ్యాంక్యూ చిత్ర రన్‌టైమ్ 2 గంటల 9 నిమిషాలకు లాక్ చేసినట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు ఈ రన్‌టైమ్ పర్ఫెక్ట్‌గా సరిపోతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

Thank You Movie: థాంక్ యూ.. విక్రమ్ కుమార్‌కు, చైతూ బ్రేకిస్తాడా?

అటు ఈ సినిమాలో చైతూ టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు అభిమానిగా ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో చైతూ సరసన అందాల భామలు రాశి ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్‌లు నటిస్తుండగా, ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తున్నాడు. మరి ‘థ్యాంక్యూ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో తెలియాలంటే జూలై 22 వరకు వెయిట్ చేయాల్సిందే.