Naga Chaitanya : మత్స్యకారులతో సముద్రంలో చేపల వేటకి వెళ్లిన నాగచైతన్య.. ఎందుకో తెలుసా..?

కె మత్స్యలేశం గ్రామాన్ని సందర్శించిన నాగచైతన్య.. తాజాగా అక్కడి మత్స్యకారులతో కలిసి సముద్రంలో చేపల వేటకి వెళ్ళాడు.

Naga Chaitanya : మత్స్యకారులతో సముద్రంలో చేపల వేటకి వెళ్లిన నాగచైతన్య.. ఎందుకో తెలుసా..?

Naga Chaitanya went fishing in the sea with fishermen

Naga Chaitanya : అక్కినేని నాగచైతన్య రెండు రోజులు నుంచి శ్రీకాకుళం జిల్లా సాగరతీరాన సందడి చేస్తున్నాడు. నిన్న ఆగష్టు 3న ఎచ్చెర్ల మండలం కె మత్స్యలేశం గ్రామానికి చెందిన మత్స్యకారుడు గణగల్ల రామరావు అనే వ్యక్తిని కలిసి, అతనితో ప్రత్యేకంగా కొంతసేపు మాట్లాడి తన జీవనశైలిని తెలుసుకున్నాడు. తాజాగా నేడు అతనితో కలిసి సముద్రంలో చేపల పట్టడానికి బోటులో వేటకి వెళ్ళాడు. ఇంతకీ నాగచైతన్య ఇదంతా ఎందుకు చేస్తున్నాడో తెలుసా..? ప్రత్యేకంగా మత్స్యకారు గణగల్ల రామరావునే కలవడానికి గల రీజన్ ఏంటో తెలుసా..?

Rajinikanth : రజినీకాంత్ కొత్త సినిమాలో నాని ప్రత్యేక పాత్ర.. నిజమేనా..?

2018లో గుజరాత్ విరావల్ నుండి 21 మంది మత్స్యకారులు వేటకెళ్లి అనుకోకుండా పాక్ (Pakistan) కోస్ట్ గార్డ్‌ చెరలో చిక్కుకున్నారు. వారందరు దాదాపు 2 ఏళ్లపాటు పాకిస్తాన్ జైల్లో బిక్కుబిక్కుమంటూ జీవితాన్ని గడిపారు. అయితే ఎట్టకేలకు కేంద్రం సంప్రదింపులతో ఆ మత్స్యకారులందరు పాక్ చెరనుండి బయటబడ్డారు. ఆ మత్స్యకారుల్లో గణగల్ల రామరావు కూడా ఒకడు. ఇప్పుడు అతని జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకోని నాగచైతన్య తన తదుపరి సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాని చందూ ముండేటి డైరెక్ట్ చేస్తున్నాడు.

RGV – JD : ఒకే అమ్మాయిని ప్రేమించి.. పెళ్లి ప్రొపోజల్ పెట్టిన గురుశిష్యులు..

ఇక ఈ మూవీ కోసం నాగచైతన్య ఎంతో హోమ్ వర్క్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల పాండిచ్చేరిలోని ఆదిశక్తి యాక్టింగ్ అకాడమీకి వెళ్లి యాక్టింగ్ లో మరిన్ని మెలకువలు నేర్చుకొని వచ్చాడు. ఇప్పుడు సిక్కోలు మత్స్యకారుల యాస, బాస, వ్యవహారి శైల ఎలా ఉంటుంది అనే విషయాలు తెలుసుకోవడానికి చైతన్య కె మత్స్యలేశం గ్రామానికి వచ్చాడు. అలాగే గణగల్ల రామరావు పాకిస్తాన్ లోని జైలు జీవితం, అప్పటి పరిస్థితులు గురించి తెలుసుకోవడానికి అతని సంప్రదించారు. కాగా ఈ సినిమాని స్వచ్ఛమైన ప్రేమ కథ, ట్విస్ట్‌లు, ఎమోషన్స్‌తో మధ్య సినిమా తెరకెక్కించి ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు.