Namo App New Feature : మోడీతో దిగిన ఫోటో మిస్ అయ్యిందా? నమో యాప్‌లో దొరికేస్తుంది

ప్రధానమంత్రి మోడీతో ఫోటో దిగారా? ఆ ఫోటో మీ దగ్గర మిస్ అయ్యిందా? అస్సలు వర్రీ అవ్వకండి. మీరు ఆ ఫోటోని తిరిగి పొందడం ఇప్పుడు చాలా ఈజీ. నమో యాప్ ఇప్పుడు "ఫోటో బూత్" అనే కొత్త ఫీచర్ ద్వారా దానిని తిరిగిపొందే అవకాశం కల్పిస్తోంది.

Namo App New Feature : మోడీతో దిగిన ఫోటో మిస్ అయ్యిందా? నమో యాప్‌లో దొరికేస్తుంది

namo app introduced new feature narendra modi

Namo App New Feature : గతంలో మీరు ప్రధాని నరేంద్ర మోడీతో (Narendra Modi) దిగిన ఫోటో మిస్సయ్యిందా? తిరిగి దానిని ఎలా పొందాలో తెలియట్లేదా? అయితే ఇప్పుడు ఆ ఫోటోని ట్రేస్ చేయడం చాలా సులభం. నమో యాప్ (Namo App) ఇప్పుడు “ఫోటో బూత్” (photo booth) అనే కొత్త ఫీచర్ (New Feature)  ద్వారా దానిని తిరిగిపొందే అవకాశం కల్పిస్తోంది. AI (Artificial Intelligence) ప్రాసెస్ ద్వారా 30 రోజుల క్రితం తీసుకున్న పాత ఫోటోలను కూడా గుర్తించి తిరిగి మనకు అందిస్తుంది. అంతేకాదు వాటిని డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు.

PM Modi On Covid-19 : దేశంలో మళ్లీ కరోనా కల్లోలం.. ప్రధాని మోదీ కీలక సూచనలు, మాస్కులు మస్ట్

కొన్ని ఫోటోలు మనకి చాలా అపురూపం. అందునా మన ప్రధానమంత్రితో తీసుకున్న ఫోటో అంటే మరింత అపురూపం. అనుకోకుండా ఆ ఫోటో మన గ్యాలరీస్ నుంచి మిస్ అయ్యి ఉండొచ్చు. తిరిగి వాటిని పొందలేకపోయిన వారు అస్సలు నిరాశ చెందనవసరం లేకుండా నమో యాప్ సరికొత్త ఫీచర్ ను డెవలప్ చేస్తోంది. ఫోటో ట్రేస్ కావాలంటే ఫేస్ స్కాన్ చేసి, సెర్చ్ బటన్ క్లిక్ చేసినంత ఈజీ అని.. అందుకోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగిస్తున్నామని నమో యాప్ ప్రతినిధి చెబుతున్నారు. ఈ పద్ధతి ద్వారా ఫోటోలు సులభంగా ట్రేస్ చెప్పారు.

PM Modi : ఏప్రిల్ 8న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ

ప్రధాని మోడీ ఏ కార్యక్రమం చేపట్టినా ఆ కార్యక్రమంలో అనేకమంది మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరవుతుంటారు. అయితే ఆ సందర్భంలో తీసిన ఫోటోలు అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. ఆ తరువాత ప్రయత్నం చేసినా దొరకకపోవచ్చును. అయితే నమో యాప్ లోని AI (Artificial Intilligence) అనే ఫీచర్ ద్వారా ఆ కార్యక్రమం తాలూకు ఫోటోలను తిరిగి పొందవచ్చును. ప్రస్తుతానికి 30 రోజుల క్రితం ఫోటోలను మాత్రమే AI (Artificial Intelligence) ప్రక్రియ ద్వారా ట్రేస్ చేయవచ్చును. అలా కాకుండా ఎప్పుడూ అందుబాటులో ఉండేలా ఈ యాప్ ను అభివృద్ధి చేసే పనిలో ఉంది నమో యాప్ టీం.