Mokshagna : వారసుడొస్తున్నాడు.. బాలయ్య షో లో మోక్షజ్ఞ.. | Mokshagna

Mokshagna : వారసుడొస్తున్నాడు.. బాలయ్య షో లో మోక్షజ్ఞ..

నందమూరి అభిమానులు బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

Mokshagna : వారసుడొస్తున్నాడు.. బాలయ్య షో లో మోక్షజ్ఞ..

నటరత్న నందమూరి తారక రామారావు నటవారసుడిగా దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా నందమూరి నట వారసత్వవాన్ని కొనసాగిస్తూ అగ్రహీరోగా దూసుకుపోతున్నాడు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఆరు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు గట్టిపోటీనిస్తున్నాడు.

Akhanda : బాలయ్య ఫంక్షన్‌కి బన్నీ గెస్ట్!

తర్వాత జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న, కళ్యాణ్ రామ్ వంటి హీరోలు వచ్చినా అభిమానులంతా ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురు చూస్తుంది మాత్రం బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసమే. కెరీర్ తొలినాళ్లల్లో తండ్రి తనను ఎలా తీర్చిదిద్దారో తను కూడా తనయుణ్ణి అలాగే తయారు చెయ్యాలనే ప్లాన్‌లో ఉన్నారు బాలయ్య.

Bimbisara : కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ టీజర్ అప్‌డేట్..

తన కెరీర్‌లో మైల్ స్టోన్ మూవీ అయిన ‘ఆదిత్య 369’ సీక్వెల్ ‘ఆదిత్య 999’ తో తనయుడిని పరిచయం చేస్తానని.. ఆ సినిమాకి తాను దర్శకత్వం వహించే అవకాశం కూడా లేకపోలేదంటూ ఇటీవల చెప్పుకొచ్చాడు బాలయ్య. కట్ చేస్తే ఇప్పుడు బాలయ్య హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్’ షో కి మోక్షజ్ఞ రాబోతున్నాడని తెలుస్తోంది. శుక్రవారం షూటింగ్ స్పాట్‌లో మోక్షజ్ఞ కెమెరా కంట పడడంతో బాలయ్య ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.

Akhanda : రికార్డులు మొదలు.. సరైన మాస్ బొమ్మ పడితే.. బాలయ్యను ఆపడం కష్టం..

×