Nandamuri Mokshagna: అభిమానుల ఎదురుచూపులు.. వారసుడి ఎంట్రీ ఎప్పుడు?

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఆసక్తికర అంశం వారసుల ఎంట్రీ. సినీ ఇండస్ట్రీలో చాలా విభాగాలలో ఈ వారసుల ఎంట్రీ ఉన్నా హీరోల వారసుల ఎంట్రీ మరింత ఆసక్తికరంగా ఉంటుంది.

Nandamuri Mokshagna: అభిమానుల ఎదురుచూపులు.. వారసుడి ఎంట్రీ ఎప్పుడు?

Nandamuri Mokshanga

Nandamuri Mokshanga: సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఆసక్తికర అంశం వారసుల ఎంట్రీ. సినీ ఇండస్ట్రీలో చాలా విభాగాలలో ఈ వారసుల ఎంట్రీ ఉన్నా హీరోల వారసుల ఎంట్రీ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. స్టార్ హీరోలు ఒక తరం హవా ముగిసేలోపే మరో తరాన్ని తమ వారసులుగా ప్రేక్షకులకు పరిచయం చేస్తుంటారు. అందునా బడా ఫ్యామిలీల నుండి వచ్చే వారసులపై మరింత క్రేజ్ కూడా ఉండడం సహజం. ఇప్పటికే మెగా, నందమూరి, అక్కినేని, దగ్గుబాటి లాంటి బడా ఫ్యామిలీస్ నుంచి ఎందరో నటీనటులు కెమెరా ముందుకొచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

నందమూరి కుటుంబం నుండి మూడవ తరం హీరోగా జూనియర్ ఎన్టీఆర్ హవా కొనసాగిస్తుండగా అన్న కళ్యాణ్ రామ్ కూడా గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. అయితే.. మాస్ కా బాప్ అనేలా భారీ అభిమానులను సొంతం చేసుకున్న బాలయ్య వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇప్పుడా అన్నది చాలా కాలంగా సస్పెన్స్ గానే మిగిలిపోతూ ఉంది. అదిగో పులి ఇదిగో మేక అన్నట్లు మోక్ష ఎంట్రీకి అంతా సిద్ధం ఇక క్లాప్ కొట్టడమే బ్యాలెన్స్ అని ముమ్మర ప్రచారం జరగడం.. మళ్ళీ సైలెంట్ కావడం గత మూడు నాలుగేళ్ళగా జరుగుతూనే వస్తుంది.

ఒకపక్క బాలయ్య అభిమానులు మోక్ష ఎంట్రీ ఇప్పుడా అని కళ్ళలో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తుంటే.. మరోవైపు మోక్షకి వయసు కూడా పెరిగిపోతూ ఉంది. మోక్షజ్ఞకి ఇప్పుడు 27 సంవత్సరాల వయసు నిండింది. ఒకవిధంగా ఇదేం తక్కువ వయసు కాదు. మోక్షజ్ఞ వయసుకి అన్న జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ హీరోలకు సవాల్ విసిరే సినిమాలు చేశాడు. మరో అన్న కళ్యాణ్ రామ్ ఆలస్యంగా ఇండస్ట్రీకి రావడంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీ ఆలస్యం కావడం అభిమానులలో ఆందోళన కలిగిస్తుంది. మరి ఈ ఏడాదైనా ఈ స్టార్ వారసుడి ఎంట్రీ ఉంటుందా అన్నది చూడాల్సి ఉంది.