Nandamuri Mokshagna : ఇలాంటి అభిమానం.. నందమూరి సొంతం.. వైరల్ అవుతున్న ఫ్యాన్ టాటూ..

నటసింహా నందమూరి బాలకృష్ణ నట వారసుడు నందమూరి మోక్షజ్ఞ టాటూ వైరల్ అవుతోంది..

Nandamuri Mokshagna : ఇలాంటి అభిమానం.. నందమూరి సొంతం.. వైరల్ అవుతున్న ఫ్యాన్ టాటూ..

Mokshagna Tattoo

Nandamuri Mokshagna: నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు చెబితే అభిమానులకు పూనకాలే.. ఆయన పంచ్ డైలాగ్ విసిరితే థియేటర్లలో డైనమెట్ పేలినట్లు దద్దరిల్లిపోతాయ్.. బాలయ్యలానే ఆయన ఫ్యాన్స్ కూడా ఊర మాస్.. ఇప్పటికే చాలా సార్లు బాలయ్య డ్రెస్సింగ్ స్టైల్ నుంచి మీస కట్టు వరకు చాలామంది అభిమానులు ఆయణ్ణి ఫాలో అయ్యారు.

Balakrishna : అఖండ‏లో అదే హైలెట్..!

బైక్‌ల మీద స్టిక్కర్స్, బాలయ్య టీ షర్టులు, కాఫీ మగ్స్, ఇక నందమూరి తారక రామారావు నుంచి బాలయ్య, ఆయన తనయుడు, త్వరలో అరంగేట్రం చెయ్యబోతున్న నందమూరి మోక్షజ్ఞ తారక రామ తేజ పేర్లు తమ పిల్లలకు పెట్టుకుని ఆ కుటుంబం మీద అభిమానాన్ని చాటుకున్నారు.

రీసెంట్‌గా బాలయ్య బాబు వీరాభిమాని అట్లూరి కార్తీక్ (బాలయ్య బాబు కార్తీక్) వేసుకున్న మోక్షజ్ఞ టాటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకుముందు బాలయ్య టాటూతో సందడి చేసిన కార్తీక్.. ఇప్పుడు బాలయ్య నట వారసుడు నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా టాటూ వేయించుకున్నాడు. నందమూరి ఫ్యాన్స్ నెట్టింట కార్తీక్ టాటూ పిక్స్ వైరల్ చేస్తున్నారు.

ఎప్పటినుంచో నందమూరి అభిమానులు మోక్షు హీరోగా ఎంట్రీ ఇస్తాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే బాలయ్య.. తన దర్శకత్వంలో.. తన కెరీర్‌లో మెమరబుల్ మూవీ ‘ఆదిత్య 369’ సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ సినిమాతో తనయుణ్ణి ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పారు. వచ్చే ఏడాది మోక్షజ్ఞ హీరోగా లాంచ్ కాబోతున్నాడు.