Nandamuri వారి పెళ్ళిసందడి.. నారా, దగ్గుబాటి కుటుంబాల కలయిక!
ఎన్టీఆర్ చిన్న కుమార్తె కూతురు వివాహంలో భాగంగా పెళ్లి కుమార్తెను చేసే వేడుకను నందమూరి, నారా, దగ్గుబాటి కుటుంబాలు కలిసి ఘనంగా నిర్వహించాయి.
![Nandamuri వారి పెళ్ళిసందడి.. నారా, దగ్గుబాటి కుటుంబాల కలయిక! Nandamuri వారి పెళ్ళిసందడి.. నారా, దగ్గుబాటి కుటుంబాల కలయిక!](https://diey8xpfs90ha.cloudfront.net/wp-content/uploads/2021/12/Nandamoori.jpg)
Nandamoori
- నందమూరి కుటుంబంలో ఎలాంటి వేడుకలు, పెళ్లిళ్లు అయినా అల్లుళ్ళగా నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కీలకంగా వ్యవహరిస్తారు
- నందమూరి కుటుంబ వారసులకు సంబంధాలు చూడడంలో వెంకటేశ్వరరావు, చంద్రబాబు పూర్తి బాధ్యతలను తీసుకుంటారు
- ముఖ్యంగా చంద్రబాబు ఇలాంటి విషయాలలో అన్నీ తానై వ్యవహరిస్తారు
- ఎన్టీఆర్ చిన్న కుమార్తె కూతురు వివాహంలో భాగంగా పెళ్లి కుమార్తెను చేసే వేడుకను ఈ మూడు కుటుంబాలు కలిసి ఘనంగా నిర్వహించాయి
- రాజకీయపరంగా పరస్పర విరుద్ధంగా కనిపించే చంద్రబాబు, వెంకటేశ్వరరావు ఒకే వేదికపై కనిపించారు
- పురంధేశ్వరి-భువనేశ్వరి ఈ వేడుకను అన్నీ తానై జరిపించారు
- అటు పురంధేశ్వరి, ఇటు భువనేశ్వరి కూడా శుభకార్యాలు, వేడుకలలో ఇంటి ఆడపడుచులుగా ముందుంటారు
- చంద్రబాబు, వెంకటేశ్వరరావు ఆప్యాయంగా ఒకరిని ఒకరు పలకరించుకుంటూ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు
- చంద్రబాబు-భువనేశ్వరి, వెంకటేశ్వరరావు-పురంధేశ్వరి దంపతులు ఎన్టీఆర్ మనవరాలిని ఆశీర్వదించిన దృశ్యాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి
- ఈ వేడుకలో వెంకటేశ్వరరావు, చంద్రబాబు తోడల్లుళ్లుగా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు
- చాలా కాలం తర్వాత నందమూరి, నారా, దగ్గుబాటి కుటుంబాలు ఒకే వేదికపై కనిపించాయి
- మరోసారి నందమూరి, నారా, దగ్గుబాటి కుటుంబాలు ఒకే వేదికపై కనిపించడం ఆసక్తిగా మారింది