Nanditha Swethaa : ఆంటీలా ఉన్నావు అన్న నెటిజన్.. కౌంటర్ ఇచ్చిన నందిత శ్వేతా..

ఇటీవల నందితా తన ఇంస్టాగ్రమ్ లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అయితే ఓ నెటిజన్ ఆ ఫోటోని తనకే మెసేజ్ చేసి.. ''ప్లీజ్‌ మీరు శరీరంపై శ్రద్ధ పెట్టండి. మీ షేప్స్‌ చూసుకొండి ఓసారి. కాస్త....

Nanditha Swethaa :  ఆంటీలా ఉన్నావు అన్న నెటిజన్.. కౌంటర్ ఇచ్చిన నందిత శ్వేతా..

Nanditha

Nanditha Swethaa :  ఇటీవల చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో సెలబ్రిటీలని ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది సెలబ్రిటీలు వాటిని చూసి చూడనట్టు వదిలేస్తారు. కానీ కొంతమంది మాత్రం ట్రోల్ చేసిన వారికి గట్టిగానే కౌంటర్ ఇస్తారు. ఇటీవల చాలా మంది సెలబ్రిటీలు నెటిజన్లకు డైరెక్ట్ గానే కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా హీరోయిన్ నందిత శ్వేతా తాను పెట్టిన ఫొటోలకి ఓ నెటిజన్ మెసేజ్ చేయగా నందితా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.

 

ఇటీవల నందితా తన ఇంస్టాగ్రమ్ లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అయితే ఓ నెటిజన్ ఆ ఫోటోని తనకే మెసేజ్ చేసి.. ”ప్లీజ్‌ మీరు శరీరంపై శ్రద్ధ పెట్టండి. మీ షేప్స్‌ చూసుకొండి ఓసారి. కాస్త వర్కౌట్స్‌ చేయ్‌, ఆంటీలా కనిపిస్తున్నావు” అంటూ మెసేజ్ చేశాడు. ఈ మెసేజ్ కి నందిత ఫైర్ అయి అతను చేసిన కామెంట్లను స్క్రీన్ షాట్‌ తీసి ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసి కౌంటర్ ఇచ్చింది.

Karate Kalyani : మళ్ళీ పెళ్లి చేసుకోడానికి రెడీ.. సహజీవనం అయినా ఓకే..

అతను అన్న మాటలని స్క్రీన్ షాట్ తీసి షేర్ చేసి.. ”ఇలాంటి వాళ్లతో నరకం కనిపిస్తుంది. మనుషులు ఇలా కూడా ఉంటారా? నేను దేవతను కాదు. నేను కూడా ఓ సామాన్య మనిషిని. అందరిలానే నా పరిస్థితులు నాకు ఉన్నాయి. ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారు? నా శరీరాన్ని నేను ప్రేమిస్తాను. ఇప్పుడు నేను ఉన్న పరిస్థితులని, నేను కనిపించే విధానాన్ని ఇష్టపడుతున్నాను” అంటూ అతడికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.