Shyam Singha Roy: రెబల్‌గా మారిన నానీ.. బెంగాలీ బ్యాక్‌డ్రాప్ వర్కవుట్ అయ్యేనా?

పెద్దగా యాక్షన్, సినిమాల జోలికి పోని నాని.. ఈ సారి ఏకంగా రెబల్ గా మారిపోయాడు. ఇప్పటి వరకూ ఒకలెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క అంటూ ఆడియన్స్ ని ఊరిస్తున్నాడు. ఈ సారి అలా ఇలా కాదు..

Shyam Singha Roy: రెబల్‌గా మారిన నానీ.. బెంగాలీ బ్యాక్‌డ్రాప్ వర్కవుట్ అయ్యేనా?

Shyam Singha Roy

Shyam Singha Roy: పెద్దగా యాక్షన్, సినిమాల జోలికి పోని నాని.. ఈ సారి ఏకంగా రెబల్ గా మారిపోయాడు. ఇప్పటి వరకూ ఒకలెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క అంటూ ఆడియన్స్ ని ఊరిస్తున్నాడు. ఈ సారి అలా ఇలా కాదు అదిరిపోయే హిట్ ఇస్తానంటూ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ ని చూసి ఆడియన్స్ ఎలా ఫీలవుతున్నారు..? ఇంతకీ నానీకి బెంగాలీ బ్యాక్ డ్రాప్ వర్కవుట్ అవుతుందా..?

Telugu Actors: క్విక్ షూట్.. హై రెమ్యునరేషన్.. ఇప్పుడిదే టాలీవుడ్ ట్రెండ్!

నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ, బెంగాలీ నేటివిటీ ఉన్న మూవీ.. ఏకంగా ముగ్గురు హీరోయిన్లు ఉన్న మూవీ. వీటన్నింటికీ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా పీరియాడికల్ రెబల్ యాక్షన్ డ్రామా. మరి ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న సినిమా నానీని కూడా 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ లో అదే రేంజ్ లో, అంతే స్ట్రాంగ్ గా చూపిస్తోంది. అక్షరం కడుపు చీల్చుకుని వచ్చిన ఆయుధంలా అదిరిపోయే డైలాగ్స్ తో రెబల్ గా కనిపిస్తున్నాడు నాని.

Payal Rajput: సొగసు చూడతరమా.. పాయల్ అందాన్ని పొగడతరమా!

శ్యామ్ సింగరాయ్ సినిమాలో నాని ఎప్పుడూ కనిపించని లుక్ లో కనిపిస్తున్నాడు. ఈమధ్య రొటీన్ సినిమాల రూట్ మార్చి కొత్త కథలు ట్రై చేస్తున్న నాని.. రాహుల్ సాంకృత్యన్ తో బెంగాలీ బ్యాక్ డ్రాప్ లో శ్యామ్ సింగరాయ్ లాంటి డిఫరెంట్ రెబల్ యాక్షన్ డ్రామా చేస్తున్నారు. డిసెంబర్ 24న రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో హిట్ గ్యారంటీ అని, ఈసారి క్రిస్ మస్ సందడి మనదే అని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు నాని.

Bollywood Film Releases: వారానికో సినిమా.. కాస్కో అంటోంది బాలీవుడ్!

నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమా మీదే అన్ని ఆశలు పెట్టుకున్నాడు. సాయిపల్లవి, మడోన్నా, కృతి శెట్టి హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా నాని యాక్టింగ్ వేరే లెవల్లో ఉందని రిలీజ్ అయిన టీజర్ చూస్తే తెలుస్తోంది. లవర్ బాయ్ నుంచి ఈ రెబల్ గా మారిపోయి కొత్తగా ఆడియన్స్ కి కనిపిస్తున్న నాని ఈ సినిమానుంచి ప్రతి సినిమా సరికొత్తగా చూపిస్తానంటున్నారు. శ్యామ్ సింగరాయ్ నుంచి రిలీజ్ అయ్యే ప్రతి మూవీ లో డిఫరెంట్ గా కనిపిస్తానంటున్నాడు నాని. మరి ఈ పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో ఆడియన్స్ ని ఎంత వరకూ ఆకట్టుకుంటారో చూడాలి.